15 టీ లు త్రాపిన కవి
సాహితీమిత్రులారా!
ఈయన రచించిన నీలకంఠేశ్వర శతకం ఇప్పుడు అలభ్యము.
కానీ దానిలోని కొన్ని పద్యాలు మాత్రం లభిస్తున్నాయి.
వాటిలో ఒక పద్యం-
నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటివధూటీఘటీ
ఘనకోటీశకటీకటీతటిపటీగందేభవాటీపటీ
రనటీహారిపటీసువర్ణమకుటీప్రచ్ఛోటికాపేటికల్
కనదామ్నాయమహాతురంగ శివలింగా! నీలకంఠేశ్వరా!
ఈ పద్యం చదివిన వారికి ఎఱ్ఱాప్రెగ్గడగారు
15 టీలను త్రాపుతున్నారు గమనించండి.
నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటివధూటీఘటీ
ఘనకోటీశకటీకటీతటిపటీగందేభవాటీపటీ
రనటీహారిపటీసువర్ణమకుటీప్రచ్ఛోటికాపేటికల్
కనదామ్నాయమహాతురంగ శివలింగా! నీలకంఠేశ్వరా!
ఒక టీ.ఇంకో టీ. నాకోటీ. మరో టీ. ఏదో టీ. ఇంకేంటి. ఏంటీ. నా టీ. నీ టీ.
ReplyDeleteSir i got to know that this poem was written by vemulawada bhimakavi thru my grandfather.
ReplyDelete