Friday, May 3, 2019

మొలతాడు


మొలతాడు




సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి................

అలవిగాని ఆడది
జలపాతం పక్క-
కొలనులో దూకింది
అలలకదలిక ఆగింది

ప్రేమిస్తున్నాడో లేడో
నిమిషం గడిచేలోగా

ఉపపత్తి కావాలి !
ఊపిరి బిగబట్టి

లోతుకు మునిగింది
ఈతరాని ప్రియుడు ..

ఇరుక్కున్న
మరకతంలా

తన్నుతాను మరచి
మిన్నంటే తుంపర్లతో
ఉన్నఫలాన దూకాడు

ఎంతసేపైనా
చెంత చేరడే!

తాళలేక తక్షణం
తళతళలాడే కనులతో
తలెత్తి చూసింది
ప్రియురాలు

తేలుతూ కనిపించింది
మొలతాడు !
---------------------------------------------------
రచన: తమ్మినేని యదుకులభూషణ్, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

  1. వామ్మో మీ బండబడ. ఏమి పిచ్చి తవికలు రాస్తున్నారు. ఈ రేంజిలో పైకూలా. కుక్షిలో కుచికుచి కూనమ్మా ఐతుంది. మొలతాడు మీద తవికా. ద్యావుడా.

    ReplyDelete