Tuesday, April 16, 2019

అలిగితివా…


అలిగితివా…




సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి.................

నవ్వుతూ పలకరించే
నడుమ్మీద పుట్టుమచ్చ
ముఖం చాటేస్తే
వాలుజడలోని ముద్దమందారం
ముభావంగా చూసింది..

కాలిమువ్వలూ చేతిగాజులు
మధ్య మౌనం
మందాకినిలా ప్రవహిస్తూ..

రాయబారానికి పంపిన
మల్లెలూ మరువం
పూజగదిలో బందీలై

శిశిరం తలుపు తోసుకుని
ఇంట్లోకొచ్చినట్టు
అర్ధంకాని స్తబ్ధత..

వేడికోలు చూపుల్ని
ఇంక మోయలేనని
గాలి భీష్మిస్తే
గుండె పట్టేసి..
దైన్యం గొంతులోకి జారి
‘నన్ను క్షమించవూ’!

లిప్త మాత్రంలో నన్ను చుట్టేసిన
నీ ఒంటి మెత్తదనం
‘అసలెందుకూ ‘ అంటున్న
మెదడుని కప్పేస్తుంటే..

నీరెండ మెల్లగా
గదిలోంచి తప్పుకుంది!
--------------------------------------------
రచన: నిషిగంధ, ఈమాట సౌజన్యంతో
(న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి వెలువరించే 
“తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక 
కవితల పోటీలో ప్రథమబహుమతి పొందిన కవిత)

4 comments:

  1. ఈ తవిక కు ప్రథమ బహుమతి వచ్చిందా. ద్యావుడా. ఏముంది ఇందులో బూడిద.

    ReplyDelete
  2. నడుమ్మీద పుట్టుమచ్చ అలిగింది భయ్యా ...

    ReplyDelete
  3. ఇంకేముంది. ఇద్దరూ జింతాత జిత జిత.

    ReplyDelete
  4. వాళ్లకోసం వీళ్ళకోసం నీరెండ ఎందుకూ తప్పుకోవడం? గదికి గొళ్ళెం లేదా ఏమిటి?!

    ReplyDelete