Saturday, April 13, 2019

కల కాని వేళ తను


కల కాని వేళ తనుసాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..............

ఉదయం తలుపు తీసేసరికి
కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది

చెదురుమదురై పడివుండే
జ్ఞాపకాల పుస్తకాలు
సరిగా సర్దుకుని
మళ్ళీ ఆలోచింప చేస్తూ

ఏనాటివో గుర్తులేక
రంగు వెలుస్తున్న ఊహలు
రేకులు విప్పి అందంగా
కుండీలో కుదురుకుని
మళ్ళీ కొత్తగా పూసినట్లే నవ్వుతూ

నిన్నటి చివుళ్ళమీద
నవ్వుతున్న ఆ మంచుబిందువులు
ఇంకా మెరుస్తూ

ఎవరో స్వతంత్రంగా యిల్లంతానూ
తోటలోనూ కలయతిరిగినట్లు
కనిపించీ కనుపించని మెత్తని అడుగులు
రోజూ ఆహ్వానించే నల్లని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ…
-----------------------------------------------------
రచన: విజయ్ కోగంటి, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

  1. తవికలంటే జుగుప్స. లేదు ఈ జబ్బుకు చికిత్స

    ReplyDelete