Friday, April 12, 2019

రెండు దేహాలు


రెండు దేహాలు



సాహితీమిత్రులారా!

ఈ అనువాదకవితను ఆస్వాదించండి............

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు కెరటాలు
రాత్రి ఒక సముద్రం.

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు శిలలు
రాత్రి ఒక ఎడారి.

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు వేర్లు
రాత్రి ఒక పెనవేత

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు కత్తులు.
రాత్రి ఒక మెఱపు.

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక శూన్యాకాశంలో రాలే
రెండు చుక్కలు.
-------------------------------------------------------
రచన: విజయ్ కోగంటి, 
మూలం: Octavio Paz,
మూలం: Two bodies,
ఈమాట సౌజన్యంతో

2 comments:

  1. రెండు దేహాలు. రాత్రుళ్లు జింతాత జిత జిత.

    ReplyDelete
  2. చిత్తగించండి

    ఎదురెదురుగా ఉన్న రెండు పార్టీలు
    ఒక్కోసారి రెండు అవకాశాలు
    రాత్రికి రాత్రే ఫిరాయింపు!

    ఎదురెదురుగా ఉన్న రెండు తొడలు
    ఒక్కోసారి రెండు తొడకొట్టుళ్ళు.
    రాత్రికి ఇక వాపు!

    ఎదురెదురుగా ఉన్న రెండు గ్లాసులు
    ఒక్కోసారి ఒక్కో పెగ్గు.
    రాత్రికి ఇక పార్టీ!

    (చివరిగా)
    ఎదురెదురుగా ఉన్న రెండు పిట్టలు
    ఒక్కోసారి జస్ట్ రెండు......
    రాత్రికి బిరియానీ!

    ReplyDelete