Friday, March 29, 2019

ఎవరు చూడొచ్చేరు?


ఎవరు చూడొచ్చేరు?




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకవితను ఆస్వాదించండి...........

గాలి సావిట్లోకొస్తే
ఎవరు చూడొచ్చేరు?
నువ్వూ చూళ్ళేదూ నేనూ చూళ్ళేదు:
ఆకులు గలగల్లాడితే
తడి బట్టలు అల్లాడితే
అబ్బ గాలే అమ్మలూ!
అనుకోడం తప్పించి.

గాడుపు ఈడ్చి కొడుతుంటే
ఎవళ్ళకి కనిపిస్తుంది?
నీకూ అవుపడదూ నాకూ అవుపడదు:
చెట్లు జుట్లు విరబోసుకుని
తలలొగ్గి ఊగుతుంటే
అయ్యొ గాలిరా నానా!!
అనుకోడం తప్పించి.
--------------------------------------------------------
[Inspiration: Who Has Seen the Wind? Christina Rossetti.]
రచన: కనకప్రసాద్,
ఈమాట సౌజన్యంతో

1 comment:

  1. ఈ రోజుల్లో ఎవడేది రాసి పడేసినా అది వాడు కవిత అంటే కవితయే. తలాతోకా లేకుండా గీకిపడేసినా తప్పట్లుకొట్టే వాళ్ళూ ఉంటారు దాన్ని ఆకాశానికెత్తి మరీ పొగిడే వాళ్ళూ ఉంటారు. ఇక పత్రికలంటారా, వాటి గురించి ఏమి చెప్పుకొని ఏమి లాభం లెండి.

    ReplyDelete