Friday, October 20, 2017

స్నానాలు - స్నానోదకాలు


స్నానాలు - స్నానోదకాలు




సాహితీమిత్రులారా!


స్నానం అంటే మనం ప్రతినిత్యం చేసేదేకదా
అవును కానీ దీనిలో రకాలున్నాయట-
తలస్నానం, కంఠస్నానం అవేకదా
అవి మనకు తెలిసినవి కాని మనకు తెలియనివి
ఉన్నాయి వాటిని గురించి ఇక్కడ తెలుసుకుందాం

శాస్త్రాలల్లో స్నానాలు పంచ, దశ, సప్తవిధాలని 
తెలిపియున్నారు మన పెద్దలు.

స్నానాని పంచ పుణ్యాని కీర్తితాని మహర్షిభిః.......
అని అంటే స్నానం 5 రకాలని అవి-

1. ఆగ్నేయస్నానం
   విభూతిని శరీరమంతా పూసుకోవడం

2. వారుణ స్నానం
   బొడ్డులోతు నీటిలో మూడుసార్లు మునగడం వారుణ స్నానం 

3. బ్రాహ్మ్య స్నానం
   ఆపోహిష్టామ యోభువఃతాన ఊర్జే దధాతన....
       అనే మంత్రం చదువుతూ స్నానం చేయడం

4. వాయవ్య స్నానం
   గోధూళి శరీరం మీద వేసుకోవడం

5. దివ్య స్నానం
   ఎండ కాస్తున్నప్పుడు వర్షం కురిస్తే ఆ నీటిలో తడవడం

ఇవి ఆంధ్రవేద పరిభాష అనే గ్రంథంలో చెప్పబడినవి.
అలాగే ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేదసార రత్నావళిలో
దశవిధ, సప్తవిధ స్నానాలగురించి వివరించారు.

పై చెప్పిన 5 విధాలకు మరికొన్ని చేర్చారు ఇక్కడ
వారుణం, ఆగ్నేయం, వాయవ్యం, బ్రహ్మం, కాపిలం, మానసం,
దివ్యం అని ఏడు విధాలు

పైన చెప్పనివి కాపిలం, మానసం అనేవి రెండురకాలు

కాపిలం స్నానం -
నాభిస్థానానికి దిగువ నీటితో ప్రక్షాళన చేసికొని
శరీరం పైభాగాన్ని తడిబట్టతో తుడుచుకోవటం

మానస స్నానం
మనసులో విష్ణుస్మరణ చేసుకోవటం మానస స్నానం

పది స్నానాలు-

భస్మ గోమయ, ఘృ, ద్వారి, పంచగవ్యైస్తతః పరం
గోమూత్రం, క్షీరం, సర్పిః, మశోదకం .....
అనే శ్లోకం పదివిధాలైన స్నానాలను చెబుతున్నది.
దీనిలోని ప్రతి స్నానానికి మంత్రాలున్నాయి. అవి
మనం ఇక్కడ వివరించుకోవడం లేదు.

స్నానం చేసే విధానంలో 5 అంగాలున్నాయట
అవిసంకల్పం, మార్జనం, వరుణసూక్త పఠనం,
అఘమర్షణం, స్నానాంగ తర్పణం అనేవి
స్నానాంగ పంచకాలు.

స్నానోదకాలు-
స్నానం చేసేనీటిని కూడ మన శాస్త్రకారులు విభజించారు
అవి ఆరు విధాలు
మామూలుగా ప్రవహించే నీరు
ప్రవహించని నీరు అని రెండురకాలు
తైత్తిరీయ అరణ్యకంలో దీనికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి.
1. నదులు, సెలయేర్ల నీరు
2. బావినీరు
3. తటాకాలనీరు
4. వర్షపునీరు
5. ఎక్కడనుండైనా కడవతో తెచ్చిన నీరు
6. నీటి బోదెలు/కాలువలు/నీటి కుంటలలోని నీరు

Thursday, October 19, 2017

దగ్ధ తిథి - వార - నక్షత్రాలు- లగ్నాలు


దగ్ధ తిథి - వార - నక్షత్రాలు- లగ్నాలు




సాహితీమిత్రులారా!

మనం కొన్ని సందర్భాలలో
పనులు ప్రయాణాలు చేయకూడని
తిథి వారం నక్షత్రాలు
వింటుంటాం.
అవి ఏమిటో ఇక్కడ చూద్దాం-

దగ్ధ తిథులు-
వారం, తిథి రెండింటిని కలిపితే పదమూడు వచ్చిందంటే
అది దగ్ధతిథిగా గుర్తించాలి.
           ఆదివారం(1) - ద్వాదశి(12) - కలిస్తే 13
           సోమవారం(2) - ఏకాదశి(11) - కలిస్తే 13
           మంగళవారం(3) - దశమి(10) - కలిస్తే 13
           బుధవారం(4)  - నవమి(9)  - కలిస్తే 13
           గురువారం(5)  - అష్టమి(8)  - కలిస్తే 13
           శుక్రవారం (6) - సప్తమి(7)  - కలిస్తే 13
           శనివారం(7)  - షష్ఠి(6)    - కలిస్తే 13
ఇదేవిధంగా వీటిని మాసాలలో ఇవి 
దగ్ధతిథులు- 

మీన, ధనుర్మాసాలలో - విదియ,
వృషభ, కుంభమాసాలలో - చవితి,
మేష, కర్కాటకాలలో - అష్టమి,
వృశ్చిక, సింహ మాసాలలో - దశమి,
మకర, తులా మాసాలలో - ద్వాదశి

దగ్ధ నక్షత్రాలు-
ఆదివారం - భరణి
సోమవారం - చిత్ర,
మంగళవారం- ఉత్తరాషాఢ,
బుధవారం - ధనిష్ఠ,
గురువారం - ఉత్తర,
శుక్రవారం - జ్యేష్ఠ,
శనివారం - రేవతి.

దగ్ధ లగ్నాలు-

తదియలో - సింహ, మకరాలు
పాడ్యమిలో - తులా, మకరాలు,
పంచమిలో - కన్యా, మిథునాలు,
సప్తమిలో - కర్కాటక, ధనుస్సులు,
నవమిలో - సింహ వృశ్చికాలు,
ఏకాదశిలో - ధనుర్మీనాలు.

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
దీపావళి శుభాకాంక్షలు

Saturday, October 14, 2017

మనమేమి తింటున్నాం ఒకసారి ఆలోచించండి


మనమేమి తింటున్నాం ఒకసారి ఆలోచించండి




సాహితీమిత్రులారా!

ప్రస్తుతం మనం తింటున్న ఆహారం
గురించిన ఒక చిన్న సమీక్ష
ఆసక్తికరమైన అంశాలతో
డా. ఖాదర్ గారి ప్రసంగం వినండి
అప్పుడు ఆలోచించండి
ఇక వినండి-


Friday, October 13, 2017

అరచేతిలోని తీర్థాలు


అరచేతిలోని తీర్థాలు




సాహితీమిత్రులారా!


అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది.
ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.

కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి,
ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం
అని అంటున్నాము. అలా నీటిని
"ఓమ్ కేశవాయస్వాహా, "
"ఓమ్ నారాయణాయస్వాహా, "
"ఓమ్ మాధవాయస్వాహా ",
అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. 
ఈ సందర్భంలోని

ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.

చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే
బ్రహ్మతీర్థం అని అంటారు. 

చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ,
 ప్రజాపతి తీర్థం అని అంటారు.

అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని 
దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. 

చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ
కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు అని అంటారు.

ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.

ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద 
ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము 
కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.

సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం 
కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. 
పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం 
పితృతీర్థం అనబడుతున్నది.

ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో.

Thursday, October 12, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 8


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 8




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.............




106. గౌతముడు అహల్యను శిల కమ్మని శపించాడని 
         చెబుతున్న వారు-?
       - వ్యాసుడు, కాళిదాసు, తెలుగులో భాస్కర రామాయణ 
       కర్తలు మొదలైనవారు.
       (అంటే ఇది వాల్మీకి వ్రాయలేదు)

107. విశ్వామిత్రుని యాగం మొదలైన ఎన్ని రోజులకు ఆకాశం
        చిల్లులు పడేంత మాయ మబ్బులూ, చూస్తుండగా ప్రవాహంలా  
        నెత్తురూ - ఒక్కసారిగా పడసాగాయి?
        - 11వ పగలు రాగానే

108. రామాయణం మొత్తంలో లక్ష్మణుడు ఎంత మందిస్త్రీలకు
       ముక్కు చెవులు కోశాడు?
       - ముగ్గురు (తాటక, శూర్పణఖ, అయోముఖి)
     
109.  రామాయణం ప్రతి కాండలోని 18 సర్గకు ప్రత్యేక విశేషం
        ఉంది అంటారు వాటి వివరాలేవి?
        - బాలకాండ 18వ సర్గలో - 
        రామలక్ష్మణభరతశత్రుఘ్నుల జననం

        అయోధ్యకాండ 18వ సర్గలో-
        కైక దశరథుని వరాలడగటం

        అరణ్యకాండ 18వ సర్గలో-
        శూర్పణఖ రావడం

        కిష్కింధాకాండ 18వ సర్గలో-
        వాలిసమాధానం

        సుందరకాండ 18వ సర్గలో-
        సీతమ్మను చూడటానికి రావణుడు రావడాన్ని 
        హనుమంతుడు స్వయంగా చూడడం.

        యుద్ధకాండ 18వ సర్గలో-
        విభీషణునికి రాముడు శరణునీయడం

        ఉత్తరకాండ 18వ సర్గలో-
        వేదవతి రావణుని శపించడం

110. తెలుగులో మొదటి రామాయణం-?
      - గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం

111. గౌతముని ఆశ్రమం దగ్గర ఇంద్రుడు కోడై కూసిన
        దాన్ని వ్రాసిన కవి-?
       గోన బుద్ధారెడ్డి
     (ఇదీ వాల్మీకి రామాయణంలో లేదు)

112. వశిష్ఠుని వద్ద ఉన్న గోవుపేరు?
        - శబల

113. విశ్వామిత్ర వశిష్ఠులకు మధ్య వివాదానికి కారణం-?
      -  శబలను విశ్వామిత్రునికి ఇవ్వకపోవటం

114. శబల విశ్వామిత్రుని నుండి ఎలా రక్షించుకొంది?
        - శబల  హూంకారం నుండి కాంభోజులు,
             పొదుగు నుండి పహ్లవులు,
             రోమాల నుండి మ్లేచ్ఛులు, 
             గోమయం నుండి శకులు,
             యోని నుండి యవనులు
          పుట్టి విశ్వామిత్రుని సేనల నుండి కాపాడాయి.

115. అహల్యాగౌతముల పెద్దకుమారుడు-?
       - శతానందుడు


Sunday, October 8, 2017

శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 7


శ్రీమద్రామాయణం - ప్రశ్నోత్తరాల్లో - 7




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........



96. గుఱ్ఱాన్ని వెదకడానికి వెళ్ళిన వారెవరు?
     - 60వేల మంది సగరపుత్రులు

97. 60వేలమంది సగరపుత్రులు ఎవరి ఆగ్రహానికి బలైనారు?
     - కపిల మహర్షి తపశ్శక్తి ఆహుతైపోయారు

98. అరవైవేల మందికి ఉత్తమగతులు కలగాలంటే దేవలోకపు 
      గంగను తీసుకురావాలని చెప్పింది ఎవరు?
      - గరుత్మంతుడు

99. యాగాశ్వాన్ని కపిలుని వద్ద నుండి తెచ్చింది ఎవరు?
      - అంశుమంతుడు

100. దివిజగంగను భువికి తేవడానికై ప్రయత్నించినవారు?
       - సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు

101. దేవగంగను భువికి తెచ్చినవాడు?
       - భగీరథుడు

102. భగీరథుడు గంగకై మొదట ఎవరిని గురించి తపస్సు చేశాడు?
      - బ్రహ్మదేవుని గూర్చి

103. భగీరథునికి శంకరుని ప్రార్థించమని చెప్పింది ఎవరు?
      - బ్రహ్మదేవుడు

104. శివుని జటాజూటం నుండి బిందు సరేవరంలోకి చేరిన గంగ
         7 పాయలుగా ఏ పేర్లతో ప్రహించినది?
        - హ్రాదిని, నలినీ, పావనీ(ఈ 3 తూర్పునకు),
           సుచక్షు, సీత, సింధు (ఈ 3 పడమరకు)
          భాగీరథి(భగీరథుని వెంట) ప్రవహించాయి.

105. పాతాళానికి చేరిన  దేవలోకంలోను, భూలోకంలోనూ,
         పాతాళలోకంలోనూ ప్రవహించే ఈ గంగను పిలిచే పేరు?
         - త్రిపథగ