Saturday, September 4, 2021

కుమారసంభవంలోని సరోవర వర్ణన

కుమారసంభవంలోని సరోవర వర్ణన




సాహితీమిత్రులారా! 


ఒక సరస్సును నన్నెచోడు కుమారసంభవములో
స్త్రీవలె వర్ణించిన తీరు
ఈపద్యంలో ఎంత రమ్యంగా వర్ణించాడో
పరికించండి.

లోలాంబుజాలముల్ నీలాలకములుగా
           బాలమృణాలముల్ కేలు గాఁగ
దళితాంబుజాతంబు దెలిమోముగా నుత్ప
           లములు విశాలనేత్రములు గాఁగ
జక్కవకవ నిండుచనుఁగవగాఁ బులి
          నస్థల మురుజఘనంబు గాఁగ
మొలచు లేఁదరఁగలు ముత్తరంగలు గాఁగ
           శోభిల్లుసుడి నిమ్ననాభి గాఁగ
నబ్జవనలక్ష్మి శంభువీర్యమునఁ గొడుకుఁ
బడసి దివిజుల కీఁబూని పావకునకు
నొలసి తనరూపుచూపున ట్లొప్పు దోఁచె
శ్రీకరంబగు నా కమలాకరంబు

                                                    (10-29)


ఈ పద్యం శివుని వీర్యాన్ని శరవణమను సరస్సులో,
బ్రహ్మ ఆదేశానుసారం అగ్నిదేవుడు వదలడానికి
వెళ్ళే సమయంలో సరస్సును వర్ణించినది.

భావం-
శోభాకరమైన ఆ పద్మాకరము
చంచలములగు నీరుల సమూహములు నల్లని కురులుగను,
లేత తామరతూడులు చేతులుగను,
వికసించిన పద్మము నిర్మలమైన ముఖముగను,
కలువలు విశాలమైన నయనాలుగాను,
చక్రవాకద్వయము నిండు స్తనద్వయముగను,
ఇసుకతిన్నె గొప్ప కటిస్థలముగను,
అప్పుడే పుడుతున్న లేత అలలు పొట్టమీది ముడుతలు(త్రివళులు)గా,
 ప్రకాశించే సుడి లోతైన నాబిగా
తామరతోపు అనెడి లక్ష్మి
శివుని వీర్యంచే కొడుకును పొంది
దేవతలకు ఇచ్చేందుకు పూని
అగ్నికి సమీపించి తనరూపును
చూపుచున్నదా!
అన్నట్లు ఒప్పినది.

Thursday, September 2, 2021

ఏది సత్యం (నాటిక)

 ఏది సత్యం (నాటిక)




సాహితీమిత్రులారా!

ఏది సత్యం రేడియో నాటిక

రచన - శ్రీమతి పావని నిర్మల ప్రభావతి

దర్శకులు - శ్రీ ఐనాల రామ మోహన రావు

ప్రసారం - ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఆస్వాదించండి-



Tuesday, August 31, 2021

తన వెంటన్ సిరి .......

 తన వెంటన్ సిరి  .......




సాహితీమిత్రులారా!



నీలంరాజు వెంకటశేషయ్యగారు రాసిన "నడిచే దేవుడు" పుస్తకంలోని విషయం ఇది. జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వాములవారి దగ్గరకు మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాశి రామమూర్తి(రేణు)గారు వెళ్ళి మాట్లాడు
సందర్భంలో రేణుగారు
గజేంద్రమోక్షణం ఘట్టంలోని-

"తన వెంటన్ సిరి లచ్చివెంట నవరోధ వ్రాతము న్దాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుకౌమోదకీ శంఖచ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు దావొచ్చిరొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వారాబాల గోపాలమున్"

అనే పద్యాన్ని చదవగానే,
దానిని విని స్వామి,
ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక ఆభాణకం ఉన్నదనీ
అది పోతన కాలానికి పూర్వపుదే అయితే
బహుశా పోతన దానిని విని ఉండవచ్చునని అన్నారు.

ఆ ఆభాణకం గురించి తాము విననే లేదని,
దానిని శ్రుతిపరచండనీ పుట్టపర్తివారు అభ్యర్ధించారు స్వామిని.
ఒకటి రెండునిమిషాలు ఆగి, స్వామి ఇలా చదివారు-

"లీలాలోలతమాం రమా మగణయన్ నీల మనాలోకయన్
ముంచన్ కించ మహీం, అహీశ్వర మయం ముంచన్ హఠాద్వంచయన్
ఆకర్షన్ ద్విజరాజమప్యతిజవాత్ గ్రాహాచ్చ సంరక్షితుం
శ్రీదోవింద ఉది త్వరత్వర ఉదైత్ గ్రాహగ్రహార్తం గజమ్"

ఈ శ్లోకం ఒకటి ఉన్నట్లు పుట్టపర్తి వారికీ,
రేణుగారికి తెలియదు.
తెలియని వారింకెందరో!

Sunday, August 29, 2021

సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తన్నిందా!

సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తన్నిందా!




సాహితీమిత్రులారా!

సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తన్నిందని

చాలామంది భావిస్తుంటారు

దానికి సంబంధించిన విషయాన్ని 

ఈ వీడియోలో ఆస్వాదించండి-  



Friday, August 27, 2021

“జలపాతం” – రేడియో నాటకం

 “జలపాతం” – రేడియో నాటకం 




సాహితీమిత్రులారా!

“జలపాతం” – రేడియో నాటకం 

నవలా మూలం  – యద్దనపూడి సులోచన రాణి

రేడియో అనుసరణ – పి.శేషుబాబు 

నిర్వహణ – వి.రతన్ ప్రసాద్

ప్రసారం - ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం

ఆస్వాదించండి-




Wednesday, August 25, 2021

శ్రీశ్రీ పద్యాలు - 2

శ్రీశ్రీ పద్యాలు - 2




సాహితీమిత్రులారా!



శ్రీశ్రీ మరో మూడు యాభైలు నుండి-

మీసాలకు రంగేదో

వేసేస్తే యౌవనం లభించదు నిజమే

సీసా లేబిల్ మార్చే

స్తే సారా బ్రాంది యగునె సిరి సిరి మువ్వా!


ఉగ్గేల త్రాగుబోతుకు

ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో

విగ్గేల కృష్ణశాస్త్రికి

సిగ్గేలా భావకవికి సిరి సిరి మువ్వా!


నేనూ ఒక మూర్ఖుణ్నే

ఐనా నాకన్న మూర్ఖులగపడుతుంటే

ఆనంద పారవశ్యము

చె నవ్వక తప్పలేదు సిరి సిరి మువ్వా!


హాస్య రచనలో నొక్క ర

హస్యం  కలదనగ వచ్చు నది యేదన్నన్

వేశ్యా మాతల సన్నిధి

శిష్యరికం ఆరు నెలలు సిరి సిరి మువ్వా!


Monday, August 23, 2021

సరదా సంసారం – రేడియో హాస్య నాటిక

సరదా సంసారం  –  రేడియో హాస్య నాటిక




సాహితీమిత్రులారా!

సరదా సంసారం  –  రేడియో హాస్య నాటిక

రచన: శ్రీ మాడుగుల రామకృష్ణ

ప్రసారం- ఆలిండియా రేడియో

ఆస్వాదించండి-