Tuesday, August 31, 2021

తన వెంటన్ సిరి .......

 తన వెంటన్ సిరి  .......




సాహితీమిత్రులారా!



నీలంరాజు వెంకటశేషయ్యగారు రాసిన "నడిచే దేవుడు" పుస్తకంలోని విషయం ఇది. జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వాములవారి దగ్గరకు మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాశి రామమూర్తి(రేణు)గారు వెళ్ళి మాట్లాడు
సందర్భంలో రేణుగారు
గజేంద్రమోక్షణం ఘట్టంలోని-

"తన వెంటన్ సిరి లచ్చివెంట నవరోధ వ్రాతము న్దాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుకౌమోదకీ శంఖచ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు దావొచ్చిరొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వారాబాల గోపాలమున్"

అనే పద్యాన్ని చదవగానే,
దానిని విని స్వామి,
ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక ఆభాణకం ఉన్నదనీ
అది పోతన కాలానికి పూర్వపుదే అయితే
బహుశా పోతన దానిని విని ఉండవచ్చునని అన్నారు.

ఆ ఆభాణకం గురించి తాము విననే లేదని,
దానిని శ్రుతిపరచండనీ పుట్టపర్తివారు అభ్యర్ధించారు స్వామిని.
ఒకటి రెండునిమిషాలు ఆగి, స్వామి ఇలా చదివారు-

"లీలాలోలతమాం రమా మగణయన్ నీల మనాలోకయన్
ముంచన్ కించ మహీం, అహీశ్వర మయం ముంచన్ హఠాద్వంచయన్
ఆకర్షన్ ద్విజరాజమప్యతిజవాత్ గ్రాహాచ్చ సంరక్షితుం
శ్రీదోవింద ఉది త్వరత్వర ఉదైత్ గ్రాహగ్రహార్తం గజమ్"

ఈ శ్లోకం ఒకటి ఉన్నట్లు పుట్టపర్తి వారికీ,
రేణుగారికి తెలియదు.
తెలియని వారింకెందరో!

No comments:

Post a Comment