Tuesday, July 9, 2019

అనావిష్కృతం


అనావిష్కృతం




సాహితీవీత్రులారా!

కాగితం ఆలోచనల ఖైదు
ఆకాశం అంచులదాకా ఎగిరే
ఊహల గువ్వల్ని ఒడిసిపట్టి
అందంగా పదిలపరచే
నల్ల ఊసల పంజరం.

కళ్ళు మూసుకున్నంతసేపు
రెక్కలు రెపరెపలాడిస్తూ
గిరికీలు కొట్టే భావాలు
పెన్ను మూతవిప్పగానే
ఎక్కడికో ఎగిరిపోతాయి.
చూపులతో దారి మళ్ళించి
చేరువ చేద్దామంటే
దరిదాపులకి రాకుండా చెదిరిపోతాయి.
ధ్యానం వీటి పొదరిల్లు.
అంతరంగం ఎన్నో అనావిష్కృత పుష్పాల
విస్మృతవనం.

మనోకాసారంలో పైకి తేలేది
జీవం ఉండీలేనట్టు కనిపించే
పల్చని పచ్చని పొర మాత్రమే.
మూతపడని కళ్ళతో
మిలమిలలాడుతూ తిరిగే
బంగారురంగు చేపలేవో
ఎప్పటికీ అగుపడకుండా
అడుగునే ఉండిపోతాయి.
-----------------------------------------------------
రచన: విన్నకోట రవిశంకర్, 
ఈమాట సౌజన్యంతో

3 comments:

  1. అలా అడుగునే ఉండిపోనీ తమ్ముడూ. బైటికి తన్నుకువచ్చిన తవికలతోనే సంపకతింటన్నారు. లోపలున్నవి భండారాన దాగి ఉండనీ.

    ReplyDelete


  2. అడుగుననే ఉండని ! త
    మ్ముడు! తవికలతో జిలేబి, మురుకులతో జి
    మ్మడ! సంపక తింటున్నా
    రడుగడునా శంకరాభరణమని విదురుల్!


    నారదా!

    జిలేబి

    ReplyDelete
  3. జిలేబీ కొత్త తవికా ప్రక్రియ పైకూ.

    ReplyDelete