Tuesday, September 26, 2017

ఇవి ఉంటే అవి అక్కరలేదు


ఇవి ఉంటే అవి అక్కరలేదు




సాహితీమిత్రులారా!


ఈ పద్యం సుభాషిత రత్నావళిలో
ఏనుగు లక్ష్మణకవి కూర్చినది.

క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి
త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య  వి
త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా
ప్రముఖపదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్

దీని భావమేమిటంటే-
ఓర్పు ఉంటే కవచము అక్కరలేదట.
క్రోధముంటే హాని కలిగించటానికి శత్రువు పనిలేదు.
దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు.
స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు.
దుష్టులుంటే భయంకరమైన పాము అక్కరలేదు.
ఉదాత్తకవిత్వముంటే రాజ్యంతో పనిలేదు.
చక్కని విద్య ఉంటే సంపదలతో ప్రయోజనంలేదు.
తగురీతిన సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కరలేదు.
కాబట్టి ఓర్పు మొదలైన పదార్థాలుంటే కవచము
మొదలైన వాటితో పనిలేదు. అంటున్నాడు కవి.

No comments:

Post a Comment