ఇక్కడ ఆకు కూడ కదలాడదు
సాహితీమిత్రులారా!
మద్దుపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు
1959-60 సంవత్సరమునందు కర్నూలు
సెంట్ జోసెఫ్స్ గరల్స్ హైస్కూలులో
ప్రధానాంధ్ర పండితుడుగా పనిచేయు సమయంలో
అక్కడి అపాధ్యాయుగా ఉన్న సిస్టర్స్ అక్కడి క్రమశిక్షణ
గురించి చెబుతూ ఇక్కడ ఆకుకూడ కదలదని చెప్పిరట.
దానికిగాను ఆయన చమత్కరించిన ఈ శ్లోకం చూడండి-
పత్రం వాపి ప్రచలతి న వై బాలికా పాఠశాలా
స్వేవం శిక్షాక్రమ ఇతిపదే దేవమే వాస్తుఃకింతు
మద్భావోऽయంన చలతి మరుత్త్వత్రభిత్యేతి యస్మా
ద్వేణి బంధైర్విషధరనిభైరత్ర కాంతాశ్చరన్తి
అక్కడ ఆకులు కదలక పోవటానికి
కారణం ఇక్కడి క్రమశిక్షణకాదు
మద్భావోయం - నా అభిప్రాయమేమనగా
నచలతి మరుత్త్వత్ర భీత్యేతి-
ఇక్కడ గాలి సంచరించటంలేదు
కాన ఆకులు కదలటంలేదు
గాలి సంచరించలేదనగా
భీత్యా - భయంచేత,
గాలి ఎందుకు భయపడవలసిన పని
ఏమంటే విషధర నిభై - పాముల వంటి
వేణిబంధైః - జడలతో
అత్ర కాన్తాశ్చరన్తి- ఇక్కడ యువతులు పెక్కు
మంది తిరుగుతున్నారు కనుక
పాములు వాతాశనములు(గాలిని భుజించేవి)గనుక
తన్నెక్కడ మ్రింగిపోతాయో అని భయపడి గాలి
ఈ ప్రక్కకు రాకుండా పోయింది.
అందుచే ఆకు కదలాడకున్నది.
No comments:
Post a Comment