అర్జునుని ధనుర్విద్యాపాటవము - 1
సాహితీమిత్రులారా!
అర్జునుని ధనుర్విద్యాపాటవము గురించి వేరు
చెప్పక్కరలేదు అదిలోక విదితమే. కాని కొన్నిటిని
ఇక్కడ చెప్పుకొంటున్నము చూడండి-
ఒకనాడు ద్రోణుడు గంగానదిలో స్నానం చేస్తున్నాడు.
అప్పుడొక మొసలి వచ్చి అతని తొడను పట్టుకొంది.
ద్రోణుడు ఎంత ప్రయత్నించినా అది అతన్ని విడువలేదు.
అప్పుడు కురుకుమారులు అందరు వచ్చి ఏంచేయటానికి
సాహసించక పోయారు గురువుగారికి నొప్పితగలకుండ
మొసలిని చంపడం ఎలాగో వారికి తెలియదు పైగా
అది నీటి అడుగున ఉంది. గురువుగారి తొడకే తగలవచ్చు
దాంతో వారికి ఏంచేయాలో తెలియక నిలబడిపోయారు.
కాని అర్జునుడు మాత్రం అలా ఉండలేదు.
వెంటనే ధనుస్సును ఎక్కుపెట్టి ఏడు బాణాలతో దాన్ని ముక్కలుచేసి
ద్రోణున్ని వదిలించాడు. ఇది అర్జునుని ధనుర్విద్యాపాటవాలను
తెలిపేవాటిలో ఒక సంఘటనమాత్రమే
ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని
కొట్టడం సామాన్య విషయంకాదు.
ఖాండవదహనం నాడు అగ్నిదేవుని
అగ్నిమాంద్యాన్ని తొలగించటానికి
ఖాండవాన్ని దహించటానికి సహకరించి
నిలబడగా ఇంద్రుడు తన మిత్రుడైన తక్షకుని
రక్షించటానికి వర్షాన్ని కురిపిస్తే అర్జునుడు
తన ధనుర్విద్యాకౌశలంతో బాణాలతోనే
ఛత్రాన్ని నిర్మించి అగ్నిదేవుడు ఖాండవాన్ని
పూర్తిగా దహించేట్లుచేశాడు.
అరణ్యవాసకాలంలో దుర్యోధనుణ్ణి చిత్రసేనుడనే గంధర్వుడు
బంధించి అదృశ్యుడై ఆకాశానికి వెళ్ళినపుడు కూడ అర్జునుడు
తన శరపరంపరలను వదలి ఆకాశంలో ఒక చిక్కంలాగా కట్టి,
అతణ్ణి వెళ్ళకుండా చేస్తాడు.
No comments:
Post a Comment