మహాభారతంలో సైన్యాధిపతులు
సాహితీమిత్రులారా!
సైన్యాధిపతులను నిర్ణయించినప్పుడు వారిని
రాజులు అభిషేకిస్తారు. కురుక్షేత్రసంగ్రామంలో
దీనికి ఎక్కువ ప్రాధాన్యం యివ్వబడింది.
ద్రోణుని సైన్యాధిపతిగా చేసినపుడు
దుర్యోధనుడు-
"కనక కలశంబుల భావన జలంబులు తెప్పించి,
మంగళోపకరణ శోభితంబు గావించి, పుణ్యహనాదంబులుం బరమాశీర్వాదంబులున్
మాగధ గీతంబులున్, వంది జనస్తుతివ్రాతంబులుం బ్రభూత భూపతులుం డానును ద్రోణాచార్యునకు సేనాపత్యభిషేక పట్ట బంధం" బొనర్చాడు
ఇలాగే తరువాతిసేనాధిపతులైన కర్ణునికి, శల్యునికి
అభిషేకం చేశాడు. ఇవిసరే చివరకు
తొడలువిరిగి పడిపోయినప్పుడు కూడ
అశ్వత్థామను సేనాధిపతిగా చేసినపుడు
అతణ్ణి అభిషేకించి పట్టం కట్టాడు
దుర్యోధనుడు-
రారాజు
"కృపాచార్యుం గనుగొని యొక్క కలశంబున
జలంబు నినిచికొని రమ్మనుటయు,
నమ్మహీసురవరుండు దమ్ముజూడవచ్చి
యచ్చట నున్న సమీపాశ్రమమునికుమారులం
బ్రార్థించి యొక్క కలశంబు దెప్పించి దానిం దోయ పూర్ణంబు గావించి తెచ్చిన"
"అతనికి నెమ్మి నిట్లనియె నమ్మనుజేంద్రుడు నీవు వేగమం
చితముగ ద్రోణపుత్రు నభిషిక్తుని జేయుము ప్రీతి మచ్చ మూ
పతియుగ భూసురుండు నృపపంపున గయ్యము సేత లోక వి
శ్రుతమగు ధర్మమట్లగుట జూవె యొనర్చెద నవ్విశేష మున్"
"అనపుడు నతండు సంప్రీతుండై యగ్గురునందనునకు
సేనాధిపత్యభిషేకంబాచరించిన"
వీటిని బట్టి దుర్యోధనుడు సేనాపతుల పట్టాభిషేకానికి
ఎంతటి ప్రాధాన్యమిచ్చాడో తెలుస్తున్నది
No comments:
Post a Comment