Saturday, July 1, 2017

సుభాషితాలు


 సుభాషితాలు




సాహితీమిత్రులారా!


కొత్త సత్యనారాయణచౌదరి గారి
చాటువులుగా చెప్పిన సుభాషితాలు
ఇవి 1962 ఏప్రిల్ నెల భారతిలోనివి
మొత్తం 2ద పద్యాలు
మనం ఇక్కడ కొన్నిటిని చూద్దాం-

అందమగు భార్య, యింటిలో నతనికున్నఁ
బరుల యువతుల కోసమే ప్రాఁకులాడు
నూరఁజెరువున నిండిన నీరు విడిచి
కడవలో నీళ్ళ ముట్టును గాదె కాకి

ఇంట్లో ఎంత అందమైన భార్య ఉన్నా
కొందరు పరస్త్రీల కోసం వెంర్లాడుతుంటారు
వారికొరకై వ్రాసిన పద్యం ఇది- అలాంటివారు
చెరువులోని నీటిని వదలి కడవలోని నీటికై
వెదకే కాకిలాంటివారట - అని భావం.

ఆస్తి పాస్తులు మన వెంట నంటిరావు
వానికోసము చూచెడివారు వేఱు
పుణ్య పాపములే మనసొత్తు విడువ
నట్టి చుట్టాలుగాఁ గను పట్టుచండు

ఆస్తి పాస్తులు చనిపోయిన తరువాత
మన వెంటరావు వాటికోసం చూచేవారు
వేరేవారు వారు మామూలువారుకాని.
పాపపుణ్యాలే మన వెంట విడిచి పెట్టని
చుట్టాలవలె కనబడతాయి - అని భావం.


వినయ మెఱుఁగని చదువులు ముజునెపుడు
పైకిరానీయవనుట నిబుద్ధిసుమ్ము
చదువు వినయము జంటగాఁ గుదిరియున్న
మనుజుఁడన్నిట ధన్యుఁడై వినుతి కెక్కు

వినయం నేర్పని చదువు మనుష్యుని
ఎప్పుడూ పైకి రానీయదు
చదువు వినయము జంటగా కుదిరితే
మనుష్యుడు అన్నిటిలోనూ
వినుతి కెక్కతాడు - అని భావం

శునకమా! జంతువులలోన క్షుద్రమైన
దానని బెంగ పడఁబోకు, నేను నిన్ను
మించు వాఁడనటంచు గర్వించునొకఁడు
కలఁడు భువిని గృతఘ్నతా ఘనుఁడు నరుఁడు

ఓ కుక్కా! జంతువుల్లో క్షుద్రమైన
దాన్నని బెంగ పెట్టుకోకు
నేను నిన్ను మించిన వాణ్నంటాడు
చేసినమేలు మరిచే మనుష్యుడు-
అని భావం

No comments:

Post a Comment