Sunday, December 13, 2020

అర్ధరూపాయి అప్పు(కథ)

 అర్ధరూపాయి అప్పు(కథ)



సాహితీమిత్రులారా!

వనిత టీ.వి.లో ప్రసారమైన

యద్దనపూడి సులోచనరాణి గారి

కథల నుండి తీసుకున్న కథ

అర్ధరూపాయి అప్పు

ఆస్వాదించండి-



Friday, December 11, 2020

రాతిహృదయం(కథ)

 రాతిహృదయం(కథ)





సాహితీమిత్రులారా!


వనిత టీ.వి.లో ప్రసారమైన

యద్దనపూడి సులోచనరాణి గారి

కథల నుండి తీసుకున్న కథ

రాతిహృదయం

ఆస్వాదించండి-



Wednesday, December 9, 2020

గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!

 గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!





సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి-

ఎవరిమీదైనా కోపం వచ్చినపుడు

గాడిదకొడకా -అని తిట్టడం

ఒక అలవాటు కదా!

దీన్నే ఒక కవి ఈ పద్యంలో

ఎలా చమత్కరించాడో చూడండి-


ఆడిన మాటలు దప్పిన

గాడిద కొడుకంచు దిట్టగా విని యయ్యో

వీడా నాకొక కొడుకని

గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!


ఆడిన మాట తప్పినవాణ్ని,

అబద్దాలు చెప్పేవాణ్ని,

గాడిద కొడుకా  - అని తిట్టినపుడు

ఆ తిట్టును గాడిద విని,

అయ్యో !ఛీ! ఇటు ఆడితప్పేవాడు

నా కొడుకా? ఎంత అవమానం - అని సిగ్గుతో

బాధపడిందట.

అంటే ఆడినమాట తప్పేవాడు గాడిదకంటే

అధముడని చెప్పడం కవి భావన.


Monday, December 7, 2020

చెప్పులు దానం(కథ)

 చెప్పులు దానం(కథ)




సాహితీమిత్రులారా!


కొప్పర్తి సాహితీ వాహిని నుండి-

మునిపల్లెరాజు గారి కథ

చెప్పులు దానం

వినిపించినవారు

కొప్పర్తి రాంబాబు

ఆస్వాదించండి-




Saturday, December 5, 2020

కవి చమత్కారం

 కవి చమత్కారం





సాహితీమిత్రులారా!

తిమ్మగజపతి అనే సంస్థాధిపతి బహులోభి.

అందరు తనను అంటున్నారనికూడ తిమ్మగజపతికి తెలుసు.

అలాంటి లోభి నుండి పారితోషికము అందుకొన్నాడొక

కవి అది ఈ పద్యంతో చూడండి.


"ఇవ్వడు ఇవ్వడంచు" జనులెప్పుడు తప్పక చెప్పుచుందు 

రే
మివ్వడుఅన్యకాంత కురమివ్వడు! సంగరమందు వె
న్నివ్వడు! శత్రులన్ ప్రబలనివ్వడుబెబ్బులినైన పట్టి పో
నివ్వ డసత్యవాక్య మెపుడివ్వడు తిమ్మ జగత్పతీంద్రుడే!


కవి చమత్కారం ఎంత గొప్పదో కదా!

ఇవ్వడు ఇవ్వడు అంటారు తిమ్మగజపతిని అది వాస్తవమే

ఆయన ఏమివ్వడో చూడండి.

పరస్త్రీకి మనసివ్వడు

యద్ధములో వెన్నివ్వడు(పారిపోడు)

శత్రువులను ప్రబలనివ్వడు(ఎక్కువకానీడు)

బెబ్బలినైన పట్టి పోనివ్వడు

అసత్యవాక్యన్ని ఎప్పుడూ ఇవ్వడు

ఇన్నిరకాలుగా ఇవ్వనివాడు - అని మంచి పనులే చూపించాడు కవి

అందుకే ఇవ్వనివాడు పారితోషికమిచ్చాడు.


కవికలం

రాజు కత్తికంటె బలమైనది.

అంటారుకదా!

అది ఇదేనేమో!

Thursday, December 3, 2020

దేవునికైనా డబ్బే గురువు

దేవునికైనా డబ్బే గురువు




సాహితీమిత్రులారా!

కవి చమత్కారం ఎంత ఉంటుందో!

ఈ పద్యంలో చూపించాడు కవి

ఆ చమత్కారం చూడండి-

వాస శ్చర్మ విభూషణాని ఫణిన: భస్మాంగరాగోధునా

గౌరేక: నచ కర్షణే నకుశల: సంపత్తి రేతాదృశీ

ఇత్యాలోచ్య విముచ్య శంకర మగాత్ రత్నాకరం జాహ్నవీ

వ్యర్థం నిర్ధనికస్య జీవన మహోదారై రపిత్యజ్యతే


ధరించేది చర్మం,

ఆభరణాలు సర్పాలు,

అంగరాగము చితాభస్మము,

ఉన్నది ఒక్క ఎద్దు,

అది దున్నుటకు ఉపయోగపడదు.

ఈయన ఐశ్వర్యమిది -

అని ఆలోచించి గంగాదేవి

శంకరుని విడచి రత్నాకరుని

(సముద్రుని) చేరింది-

ఆహా! ధనహీనుని జీవితమెంత వ్యర్థము

చివరికి భార్యకూడా విడిచి పెడుతుందికదా!

Tuesday, December 1, 2020

తెనాలిరామకృష్ణుని చమత్కారం

 తెనాలిరామకృష్ణుని చమత్కారం



సాహితీమిత్రులారా!



తెనాలి రామకృష్ణుని పద్యంగా

ప్రచారంలో ఉన్న పద్యం ఇది చూడండి-


కవి అల్లసాని పెద్దన

కవి తిక్కన సోమయాజి గణుతింపంగా

కవి నేను రామకృష్ణుడ

కవి యను నామంబు నీటి కాకికి లేదే


తిక్కన సోమయాజి, అల్లసాని పెద్దన

ఇద్దరూ చెప్పుకోదగిన కవులు -

 రామకృష్ణుడనే పేరుగల నేను

కూడ కవిగా పేర్కొనబడుతున్నాను.

కవి అనే పదానికి నీటి కాకి

అనే అర్థం కూడ ఉన్నదికదా!

కవి అనే మాట వాడుకలో ఉన్నంత

మాత్రాన నేను వారిద్దరితో

సమానుణ్ని కాలేను.

వారికీ నాకు కవితాశక్తిలో ఎంతో

తారతమ్యం ఉంది -

అని రామకృష్ణుడు తన వినయాన్ని

చాటుకున్నాడు.

(క = నీరు, వి = పక్షి, కవి = నీటిపక్షి)