వాల్మీకి - ఆధ్యాత్మ రామాయణాల తేడా
సాహితీమిత్రులారా!
మనం రామాయణం అనగానే మనకు వాల్మీకి రామాయణం గుర్తుకు వస్తుంది.
అది సంస్కృతంలో మొదటి కావ్యం మరియు దాని
ఆదికావ్యమని పేరు. దీనిలో వాల్మీకి శ్రీరాముని ఒక ఉదాత్తమైన మానవునిగా చిత్రించాడు.
అతని దివ్యత్వాన్ని నేపథ్యంలోనే ఉంచాడు. కారణం
ఈ లోకంలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని విపులీకరించటానికి వాల్మీకి
ఆ విధంగా చేశాడు. మనం సామాన్యవ్యక్తులం కనుక మనకు అలా ప్రవర్తించటం
వీలుకాదనుకుంటాం. శ్రీరాముణ్ణి మానవునిగానే చిత్రీకరించటంచేత అతడు
ఆదర్శపురుషుడైనాడు. కాబట్టి జనసామాన్యానికి వాల్మీకి రామాయణం
ఆదర్శప్రాయమౌతుంది.
ఆధ్యాత్మరామాయణం బ్రహ్మాండపురాణంలో 61వ అధ్యాయంలో ఉంది.
దాన్ని వ్రాసింది వ్యాసుడు. దీనిలో శ్రీరాముడు భగవంతుని అవతారమని
అడుగడుగునా తెల్పబడుతూంది. సీతాపహరణం యథార్థ సీతాపహరణం
కాదనీ, మాయా సీతాపహరణం అనీ, కైకదయీ మందరలు కూడా
దైవప్రేరణచేతనే ఆ విధంగా ప్రవర్తించారని, రావణుడుకూడ శ్రీరాముడే
పరమాత్మ అని తెలిసి శ్రీరామునిచే వధింపబడి వైరభావంతో మోక్షం
సముపార్జించటానికే సీతాపహరణం చేశాడని ఆధ్యాత్మ రామాయణం
చెబుతుంది. దీన్ని ముముక్షువులు మోక్షసాధనకోసం ముక్తిని కాంక్షించి
ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేస్తారు.
(ఆధారం ఆధ్యాత్మరామాయణం పీఠిక)
No comments:
Post a Comment