అందరము పొందుగ బతకాలి
సాహితీమిత్రులారా!
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కోరిక
చూడండి.
ఇది ఆయన గేయసంపుటిలోది
ఆస్వాదించండి-
ఈ జీవిక ఏనాడును ఏ నెరుగను తీరిక
వాడక కలచును నా మది వీడక ఒక కోరిక-
పుడమి నెల్ల లవలేశము విడువక తిరుగాలి
అడు గడుగున ఆగి ఆగి అరసి అరసి సాగాలి
ప్రతి మానవ గేహమునకు అతిథిని కావాలి
ప్రతి ఎదలో నా నెయ్యపు పాలు పోసి నింపాలి
వసుధను నా వీటిలోన వసుధలోన నా వీటిని
పొసగించి అందరము పొందుగ బతకాలి
"ఎద vs ఎముక"- ఈ తవికలో మొదటి పంక్తి.
ReplyDeleteబద్మాష్ లెక్కలేస్తివంటే బొక్కలు ఇరగదీస్తరోయ్-
శరీరం లోని ఎముకల పేర్లతో తవిక వ్రాయడం ఒక్ గొప్ప ప్రయోగం.
దేవులపల్లి కృష్ణశాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా చేయలేని ప్రయోగమిది
అనానీమస్సులవారుకూడా ప్రశంసించారంటె..దేవులపల్లివారి కవితను మించిన కవిత ఆయనకు కనిపించివుండాలి..దానికి కూడా సాహితీవందనంలో చోటు ఖరారు చేయండి.
ReplyDelete