నా ప్రవృత్తి
సాహితీమిత్రులారా!
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి
ప్రవృత్తిని గమనించండి ఆయన మాటల్లో-
ఒక మనోహరమైన యూహ హఠాత్తుగా
చింతనొందు మనస్సు చివర తగిలి
ఒక మంచుబిందువోలిక చల్లనైన భా
వం బంతరాత్మ లోపలను దోచి
కనిపించుచున్న వస్తు నికాయముననొక్క
సుందరాకృతి మనస్సుననుజొచ్చి
ఒక్కొక్కమాట యెందో వినంబడి గూఢ
మొక యర్థమది యెంతయో ధ్వనించి
కూరుచీకటి వోలె నెడారివోలె
నైన నా జీవితంబున యందునొక్క
మెఱుపు మెఱిపించి కొన్ని నిమేషములుగ
నమృత ఖండంబు చేయు నాయాత్మసీమ
కడమట నాజీవితంపు చీకటులు త్రోవ
నా మెఱుగు వెల్గుపొరలు తారాడి యెప్పు
డపుడె ధర రాలిపడునన్న ప్రాణ కుసుమ
ములకు నులిపచ్చిగల తొడిమలను గూర్చు
విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రపంచ సాహిత్య చరిత్రలో కాళిదాసు షేక్స్పియర్ స్థాయి రచయిత.
ReplyDelete