కాఫీ
సాహితీమిత్రులారా!
ఖండకావ్యాలు నుండి ఈ కాఫీ ఖండిక ఆస్వాదించండి-
ఆకటికి శంకరుఁడు నంగలార్చి విషము
ద్రావెనే గాని కాఫీని ద్రావలేదు
నిండు దాహార్తిమై యగస్త్యుండు జలధి
ద్రావెనే గాని కాఫీని ద్రావలేదు
అమరులమృతము ద్రావినారపుడు, ఇపుడు
ద్రావుచున్నాము కాఫీని తరచు మనము
అది జరామరణంబుల నాపుచుండు
నిది జరామరణంబుల నిచ్చుచుండు
సురల కమృతముఁబోసి యసురులకెల్ల
కాఫీ పోసెను మోహినీ కాంత యపుడు
అవని ఆకాఫియే యిప్పుడవతరించి
మనల బీడించుచున్నది దినదినంబు
మధువుకన్నను దియ్యనై మతిని దనుపు
సుధను మీరినదై చాల సొగసు గూర్చు
చక్కెరకు మించి యమృతంబు ధిక్కరించు
కాఫికన్నను వేఱె భక్ష్యంబు గలదె
గురువు చెప్పినగాని గుడికిఁ బోవనివాడు
కాఫిదుకాణంబు కడకుఁ బోవు
పరదేశ విద్యని బడికిఁ బోవనివాడు
పెసరట్లకైపోయి పీకులాడు
కోటిపోయినఁగాని కోర్టుకెక్కనివాఁడు
పోటీకి టీత్రాగబోవుచుండు
మతమతాచారముల్ మఱచిపోయినవాడు
మధురమౌ కొకొను మఱచిపోఁడు
అఖిల సంగపరిత్యాగి యైన కాఫి
మాట చెప్పినఁ ద్రావక మానలేఁడు
సూర్యునెఱుఁగనివారలఁజూడవచ్చు
కాఫి యెరుగనివారలఁ గాంచలేము
కాఫీ ఖండిక బాగుంది కానీ కవి గారికి “బ్రహ్మర్షి” బిరుదెక్కడ నుండి వచ్చినట్లు? వారి ఉద్దేశం ‘బ్రహ్మశ్రీ’ అనా? విశ్వామిత్రుడే “బ్రహ్మర్షి” అనిపించుకోవడానికి ఎన్నో సంవత్సరాల తపస్సు చెయ్యాల్సివచ్చింది కదా.
ReplyDeleteఆర్యా
Deleteధన్యవాదాలు
శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం, పిఠాపురం వారు ప్రచురించిన పుస్తకం ఖండకావ్యాలు దాన్నుండి నేను తీసుకొని మీముందుంచాను
మిగిలిన వివరాలు నాకు తెలియవు
అది 1905లో తొలిముద్రణ మూడవ ముద్రణ 1998.
Deleteఆలి షా గారు పేరొందిన మౌల్వీ. వారిని బ్రహ్మర్షి అనవచ్చు . ఒక వినూత్న పంథా పిఠాపురం లో వారి వారసులది. జయహో భారత్ !
జిలేబి
అలాగాండి? సంతోషం. వివరించినందుకు థాంక్స్ “జిలేబి” గారూ.
Deleteఇది విశ్వామిత్రుడు, వశిష్ఠుడి కాలం కాదు లెండి. ఇంతకు ముందు నేను విన్నది ... ఆధునిక కాలంలో “బ్రహ్మర్షి” బిరుదున్న వ్యక్తి సంఘసంస్కర్త సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ... అని. వారికి బ్రహ్మసమాజం వారు ప్రదానం చేశారట ఆ బిరుదును.
మరొక స్వాతంత్ర్యోద్యమ ప్రముఖుడు బులుసు సాంబమూర్తి గారు ... వీరిని “మహర్షి” అనేవారట.
Deleteమీకూ ఇస్తున్నా పుచ్చేసుకోండి :)
సిరి " దా" వస్తే వద్దన కండేం :)
జిలేబి
రొంబ నన్రి.
Deleteమోకాళ్ళ నెప్పులు, అంచేత సిరి వస్తే అడ్డుపెట్టలేను 🙂.
బిరుదుజిలేబిీనారద
Deleteసురమునిశివరాత్రినాడుశుభమననొసగెన్
వరమనగవిన్నకోటకు
సరియగుసాహిత్యమూర్తి జగతిన్ బడయన్
గాదిరాజు మధుసూదనరాజు
అయ్యో, అంత ఏమీ లేదు రాజు గారూ. ఏదో మిడిమిడి జ్ఞానం మాత్రమే.
Deleteధన్యవాదాలు.
బిరుదు గొన్న వారు , బిరుదు లిచ్చినవారు
Deleteపేరు గలుగు గొప్ప బిరిదు మగలు ,
విని తరించు టొకటె ప్రియమౌట మావంతు
నమము విబుధ శ్రేయ ! నరస రాయ !!
🙏
Deleteయసురులకెల్ల
ReplyDeleteకాఫీ పోసెను మోహినీ కాంత యపుడు
మనమసురుల జాతే (నా ?)
కాఫికన్నను వేఱె భక్ష్యంబు గలదె
కాఫీ కూడా భక్ష్యమే నన్నమాట ,
కాఫీ సాపటా _ అరవల సాంప్రదాయంలో .....
Deleteఅరవంలో కాఫీ సాప్పిడుంగో అంటారండీ :)