Friday, August 5, 2016

మహాదు:ఖపరుడు ఎవరు?


మహాదు:ఖపరుడు ఎవరు?


సాహితీమిత్రులారా!

లోకానుభవంతో మన పెద్దలు చెప్పినవి సర్వదా
ఆమోదయోగ్యమైనవే.
ఈ శ్లోకం చూడండి.

లోకేషు నిర్ధనో దు:ఖీ ఋణగ్రస్త: తతోధికమ్
తాభ్యాం రోగయుతో దు:ఖీ తేభ్యోదు:ఖీ కుభార్యక:


లోకములో ధనములేనివాడు దు:ఖించును.
వానికంటె అప్పున్నవాడు దు:ఖించును.
వీరిద్దరి కంటె రోగముతో బాధపడేవాడు దు:ఖించును.
వీరికంటె గయ్యాళిభార్యకలవాడు మహాదు:ఖమును అనుభవించును.

ద్విముష్టీ చతురంగుళ:!


ద్విముష్టీ చతురంగుళ:!


సాహితీమిత్రులారా!

పూర్వం ప్రయాణాలన్నీ నడకేగా ఎంత దూరమైనా నడిచే వెళ్ళేవారు.
వర్షం వచ్చినా వరదలోచ్చినా అంతేగా. ఇలా ప్రయాణాలలో
ఎన్నో వింతలు విశేషాలు. అవీ శృంగారం కావచ్చు హాస్యం కావచ్చు
కరుణరసం కావచ్చు ఏదైనా బహుఅందంగా చెప్పేవారు
మన పూర్వులు. అలాంటిదే
ఒక చతురశృంగార సంఘటన
చూడండి.

ఒక ఏరు దాటుతుండగా లోనికి దిగి వెళ్ళే వారు
మొదట మోకాలు దాకా బట్టలను ఎత్తి నడుస్తూ
నీరు మరీ ఎక్కువైతే తొడలదాకా ఎత్తి వెళతారుకదా!
ఒక ఆవిడ ఇలాగే
దాటుతూ చీర పైకెత్తుకొని -
అరచేయిని అడ్డం పెట్టుకొని నడిచే దృశ్యం
చూచాడొక యువకుడు.
ఆమె అరచేయి అడ్డం పెట్టుకొని
ముందుకు సాగుతున్నదికదా!
అని - తన అంగమును గుప్పిలి
పట్టుకొంమని ఊహించాడు
కాని అదికుదరలేదు.
అప్పుడు ఆ యువకుడు తనలో -

అహో! భాగ్యవతీ నారీ! వామ హస్తేన గోపితమ్!
పాపోహం పాపకర్మాహం! ద్విముష్టీ చతురంగుళ:!

                                                                      - అని అనుకొన్నడట.

(ఆహా! ఈ నారి ఎడమచేతిని అడ్డం
చేసి ముందుకు సాగింది.
ఈమె అదృష్టవంతురాలు!
నేను పాపాత్ముడను రెండు గుప్పిళ్ళతో పట్టినా
ఇంకా నాలుగంగుళాలు మిగిపోయింది
 -అని  శ్లోక భావం)

Thursday, August 4, 2016

సొమ్మొకరిది - సోకొకరిది


సొమ్మొకరిది - సోకొకరిది


సాహితీమిత్రులారా!

సొమ్మొకరిది - సోకొకరిది అనే నానుడి మనమంతా
వింటున్నదే కాని
కవి దీన్ని
ఈ శ్లోకంలో ఎంత చమత్కారంగా
చెప్పాడో
చూడండి.

కష్టా వేధవ్యధా కష్ట: నిత్యంచ వహన శ్రమ:
శ్రవణానాం అలంకార: కపోలస్య కుండలమ్

చెవులకు పెట్టిన ఆభరణభారం శ్రమ చెవులది.
అందం మాత్రం చెక్కిళ్ళది(చెంపలది)
నిజమేకదా సొమ్మొరకిది - సోకొకరిది.

కుచద్వయంబునకు నాశీర్వాదమబ్జాననా!


కుచద్వయంబునకు నాశీర్వాదమబ్జాననా!


సాహితీమిత్రులరా!

మహాకవి శ్రీనాథుని వింత ఆశీర్వాదాలు మనం మునుపు చూశాము
ఇపుడు మరొకటి చూడండి.
ఒక అందాల బొమ్మ అపరంజికొమ్మ
గుబ్బలమిటారి కవిగారికి కనువిందు చేసిందొకనాడు
అందించాడీ పద్యాన్ని చూడండి.

బిగువై వట్రువులై, విరాజితములై, బింకములై, యుబ్బులై
నగసాదృశ్యములై, మనోహరములై, నాగేంద్ర కుంభములై
సొగసై, బంగరు కుండలై, నునుపులై, సూనాస్త్రు చేబంతులై,
బిగి చేబట్టు కుచద్వయంబులకు నాశీర్వాదమబ్జాననా!

ఎటువంటి ఘనవక్షోజాలో చెప్పాడుకదా అటువంటి
వాటికి శ్రీనాథుని ఆశీర్వాదం లభించింది.
(నాగ - ఇంద్ర - గజరాజు)

Wednesday, August 3, 2016

ప్రభాతలక్ష్మి కబరిభారంబు మీఁది చెంగలువ కచ్చు


ప్రభాతలక్ష్మి కరిభారంబు మీఁది చెంగలువ కచ్చు


సాహితీమిత్రులారా!

కాశీఖండంలో శ్రీనాథుని
సూర్యోదయ వర్ణన చూడండి.

ధరణీధరములందు ధాతు పాషాణంబు
       పాదపంబులయందుఁబల్లవంబు
పాథోనిధులయందుఁబవడంబు లేఁదీగ
       కాలాభ్రములయందుఁగోల మెఱపు
హరిదంత నాగంబులందు సింధూరంబు
        భూమి యొడలి యందు హేమభూష
యాకాశవీథియం దవతంసరత్నంబు
       నబ్జజాండగృహంబునందు దివియ
యగుచు బాలాతపము జగం బాక్రమింప
నంధకారము దిక్కుల నస్తమింప
భానుబింబము వొడిచెఁ బ్రభాతలక్ష్మి
కబరిభారంబు మీఁది చెంగలువ కచ్చు
                                          (కాశీఖండము 3-239)


వేకువ అనే లక్ష్మి (ప్రభాతలక్ష్మి) సిగలో ఉండే
ఎర్రకలువల పూబంతి(కచ్చు)
అన్నట్లుగా సూర్యబింబం ఉదయించింది.
సూర్యబింబం ఉపమేయం.
ఇది ఏ ఏ స్థలాలలో ఎలా ఉందో శ్రీనాథుడు
ఉపమాన ఉపమేయాలకు భేదంలేకుండా
అంటే రూపకాలంకారంలో చెప్పాడు.
సూర్యబింబం -
1. పర్వతాలమీద(ధరణీధరం) ఉండే జేగురురాయి(ధాతుపాషాణం)
2. చెట్ల మీద (పాదపం) ఉన్న చిగురుటాకు.
3. సముద్రాలలో (పాథోనిధి) దొరికే పగడపు తీగ.
4. నల్లని మేఘాలలో (కాల - అభ్రము) సన్నని (కోల) మెరుపు.
5. దిగంతాలలో ఉండే ఏనుగులకు (హరిదంత నాగ)
     కుంభస్థలంమీద ఉండే సింధూరం.
6. భూదేవి శరీరం పైన మెరిసే బంగారు నగ(భూష)
7. ఆకాశవీథిలో శిరోరత్నం (కిరీటంలోని రత్నమని).
8. బ్రహ్మాండమనే (అబ్జజ - అండ - గృహంబు) మందిరంలోని దివ్వె.

ఉపమానాలన్నీ ఎర్రనివే. ఉదయించే సూర్యబింబం వీటిలా ఎర్రగా ఉందని.
లేత ఎండ జగత్తును ఆక్రమిస్తూ ఉండగా
సూర్యబింబం ఉదయించింది(పొడిచెన్) -
ప్రభాతలక్ష్మి కొప్పులో (కబరిభారంబు మీఁది) ఎర్రకలువ పూబంతిలా. 

Tuesday, August 2, 2016

బ్రహ్మకైన పుట్టు రిమ్మతెగులు


బ్రహ్మకైన పుట్టు రిమ్మతెగులు


సాహితీమిత్రులారా!

బ్రహ్మకైన పుట్టు రిమ్మతెగులు అనే సామెత వినే ఉన్నాముగా
ఈ పద్యం చూస్తే నిజమే అనిపిస్తుంది చూడండి.

దశావతారచరిత్రలో ధరణిదేవుల రామయామాత్యుడు
మోహినిని వర్ణించిన సందర్భములోనిది ఈ పద్యం.
అమృతాన్ని దేవదానవులకు పంచుతున్న
మోహినిని బలి చక్రవర్తి చూచిన సందర్భము.

సుదతి వడ్డించునపుడు పయ్యెద యొకింత
తొలఁగ గుబ్బలు సూచు నబ్బలియుఁ బల్క
రింప లేడయ్యెఁ డాఁ బల్కరింపఁ దెలిసి
యట్టె పయ్యెదఁ గప్పునో యను భయమున
                                       (దశావతారచరిత్రము 2-553)

బలిచక్రవర్తి ఉత్తముడే కానీ ప్రహ్లాదునిలాగానే పుట్టుకతో దైత్యుడుకదా!
అందుకే ఆయనను రాక్షసుల వరుసలో కూర్చోబెట్టారు అమృతం త్రాగడానికి
కానీ మోహిని భ్రాంతిలో పడిపోయాడు ఆమె అందానికి అందరూ దాసులైపోయారు.
కొయ్యబారిపోయారు.
ఆ అందం ఎలాంటిదో మరి..........
మోహిని(సుదతి) అమృతం వడ్డించే సాకుతో బలిచక్రవర్తి దగ్గరకు వచ్చింది
సరిగ్గా అదేసమయానికి మోహిని పైట ఒకింత తొలగింది. ఆమె గుబ్బలు కనిపించాయి.
వాటిని చూస్తూ ఉండిపోయాడే తప్ప అంతటి బలిచక్రవర్తి ఆమెను పలకరించలేదు
కారణం
పలకరిస్తే ఆమె పైటను సవరించుకుంటుందేమో?
గుబ్బలు కనిపించకుండా పోతాయనే భయంతో.

ఏమిటిది రిమ్మతెగులేకదా!

Monday, August 1, 2016

రసరాజు గజల్స్


రసరాజు గజల్స్


సాహితీమిత్రులారా!

సినీగేయరచయిత రసరాజు -
గజల్ శ్రీనివాసు పై వ్రాసిన గజల్స్ చూడండి.


గజలు శ్రీనివాసులోని ఒక మహత్తుకన్నాను
ప్రజలు చూసి శ్లాఘిస్తే గుండెకత్తుకొన్నాను

కవిలో ఋషి ఉన్నాడని కంజీరా మ్రోగినపుడు
పరవశించి పదేపదే కళ్లు ఒత్తుకొన్నాను

పాటమధ్య మాట ఒకటి పన్నీరై తడిపినపుడు
ఏ తల్లికి కొడుకోయని మురిసి హత్తుకొన్నాను

సేవకంటె శిఖరమేది లేదని గొంచెత్తినపుడు
ఎదలో ఒక థెరిస్సాను నేను విత్తుకొన్నాను

పాట పాడుతూ శ్రోతను పలుకరించినపుడు
ఎడదలోని పడవకు తెరచాప ఎత్తుకొన్నాను

ఆగని చప్పట్లమధ్య సభకు ఊపిరిరాడనపుడు
నేనుకూడ రసరాజై అతని ఎత్తు కన్నాను