Wednesday, October 12, 2022

కాశీమజిలీ కథలు 1 - మణిసిద్ధుని కథ

 కాశీమజిలీ కథలు 1 - మణిసిద్ధుని కథ 




సాహితీమిత్రులారా!

కథల్లో కాశీమజిలీ కథల అందం వేరు. ఈ కథల రచయిత మధిర సుబ్బన్న దీక్షిత కవి గారు. నిజానికి  వివిధ ప్రాంతలలో జానపదులు చెప్పుకునే కాశీమజిలీ కథలను పోగేసి, వాటికి మరిన్ని కల్పనలు జోడించి, వాటన్నింటినీ కలిపి 12 సంపుటాలుగా తీసుకు వచ్చారు సుబ్బన్న దీక్షితులు గారు. ఈ విషయాన్ని క్రీ.శ. 1900లో అచ్చయిన తమ “కాశీమజిలీ కథలు” మొదటి సంపుటి పీఠికలో ఆయనే చెప్పుకొచ్చారు. అంటే మొదటి సంపుటి అచ్చయ్యి ఇప్పటికి 120 సంవత్సరాల పైమాటే అన్నమాట. అప్పటి పుస్తక భాష గ్రాంథికం కనుక, అది ఇప్పటి తరంలో అందరికీ అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ కనుక, సరళమైన భాషలో, కథలో ఎటువంటి మార్పులూ చెయ్యకుండా, కుదిరినప్పుడల్లా, ఒక్కో కథా చెప్పుకుంటూ వెళతాను. 

గుణనిధి అనే బ్రాహ్మణుడు మణిసిద్ధునిగా మారి, కోటప్ప అనే ఒక గొల్లపిల్లవాడిని వెంటబెట్టుకుని 360 మజిలీలతో కాశీ పట్టణాన్ని చేరుకుంటాడు. ఆ మజిలీలలో మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన కథలే ఈ కాశీమజిలీ కథలు. అద్భుతమైన కల్పనలు, మోతాదు మించని శృంగారం, కడపుబ్బా నవ్వించే హాస్యం, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే నాయికానాయకుల బుద్ధిచాతుర్యం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఇలా ఒకటేమిటి, నవరసాలూ మేళవించబడిన కథలివి.  ఇంతమంచి కథలను మనకు అందించిన మధిర సుబ్బన్న దీక్షిత కవి గారికి నమస్కరించుకుంటూ… మనం కూడా కాశీమజిలీయాత్ర మొదలు పెడదాం.

రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment