Tuesday, February 20, 2018

గుణాఢ్యుడు - బృహత్కథ


గుణాఢ్యుడు - బృహత్కథ




సాహితీమిత్రులారా!


సంస్కృతంలో వెలసిన కథాకావ్యాలలో
గుణాఢ్యుని బృహత్కథ చెప్పదగింది.
ఇది వెలసిన తరువాత అనేక కవులకు
కావ్యనాటకాలకు ఇతివృత్తాలను సమకూర్చింది.
సంస్కృత సాహిత్యంలో వ్యాస, వాల్మీకుల సరసన
పేర్కొనదగినవాడు గుణాఢ్యాడు. బృహత్కథ సంస్కృతంలో
కూర్చబడలేదు. దానికి గల కారణం తెలిపే ఒక ఒకకథ
ప్రచారంలో ఉంది. ఆ కథ........
             శాతవాహనరాజు ఒకసారి రాణితో జల విహారం చేస్తూండగా
ఆమె "మోదకైస్తాడయ(నీళ్లతో నన్ను కొట్టకు)"
అనగా రాజు పొరపాటుగా అర్థం చేసుకొని మోదకాలను
(లడ్డూలను) తెప్పించి రాణి మీదికి విసరసాగాడు.
రాజుకు సంస్కృతం రానందున రాణి పరిహాసమాడింది.
రాజు ఆస్థానంలో ఉన్న గుణాఢ్యుడు ఆరుసంవత్సరాల్లో
ఆయనకు సంస్కృతం నేర్పుతానన్నాడు. ఆ ఆస్థానంలోనే
ఉన్న శర్వవర్మ తానైతే ఆరు నెలల్లోనే నేర్పుతానన్నాడు.
దానికి గుణాఢ్యుడు అలా నేర్పగలిగే పక్షంలో నేను సంస్కృత
ప్రాకృత దేశభాషలను త్యజిస్తాను అని శబథం చేశాడు.
శర్వవర్మ ప్రత్యేకంగా కాతంత్రవ్యాకరణాన్ని రచించి తాను చెప్పిన
 ప్రకారం 6 నెలల్లో రాజుకు సంస్కృతం నేర్పాడు. తాను చేసిన
శపథం ప్రకారం గుణాఢ్యుడు సంస్కృత ప్రాకృతాలను వదలివేశాడు.
అందుకే పైశాచిక భాషలో బృహత్కథ వ్రాశాడు.

                                         దీనిలోని కథలో చివరిభాగం మాత్రమే
మనకు లభ్యమౌతూంది. దీనికి ఒక కథ చెప్పబడుతూంది.
శపథ ప్రకారం గుణాఢ్యుడు ఆ భాషలను వదలివేసి రాజాస్థానం
నుండికూడ వెళ్ళాడు. తర్వాత బృహత్కథను వ్రాసికొని రాజుకు
ఇవ్వాలని వెళ్ళగా  తీసుకొని కొందరు పండితులకిచ్చి చదివి
వారి అభిప్రాయం చెప్పమన్నాడు. వారు అది అంత గొప్ప
పుస్తకం కాదని ఈర్ష్యతో చెప్పగా రాజు దాన్ని గుణాఢ్యునికి వెనక్కు
ఇవ్వమని పంపేశాడు. దానికి బాధపడి గుణాఢ్యుడు అది తీసుకొని వెళ్ళాడు.
రాజుగారి భోజనంలో ఏరుచీలేని మాంసం వంటవాడు వడ్జిస్తున్నాడు.
దానికి రాజు నిలదీసి అడగ్గా దానికి వంటవాడు. రాజా అడవిలో
జంతువులన్నీ ఒక దగ్గరే కూర్చోని ఆహారంలేకుండా ఉన్నాయి.
అక్కడ ఒకాయన మంటచేసి అందులో ఏదో చదువుతూ
చదివిన తాళపత్రాన్ని అందులో వేసేస్తున్నాడు. ఆయన చుట్టూ
జంతువులన్నీ వున్నాయి అని చెప్పగా రాజు ఆశ్చర్యంతో అక్కడికి
వెళ్ళి చూడగా అక్కడ గుణాఢ్యుడే అది చదివి అందులో
వేస్తున్నాడని గమనించి తానెంత పొరపడ్డానో అర్థమై ఆయన్ను
ప్రాథేయపడి అక్కడినుండి పిలుచుకు వెళ్ళాడట. ఆ మిగిలిన కథే
ఇప్పుడు మనకున్న బృహత్కథ.
దీన్ని బుద్ధస్వామి బృహత్కథాశ్లోక సంగ్రహ అని,
క్షేమేంద్రుడు బృహత్కథామంజరి అని,
సోమదేవుడు కథాసరిత్సాగరం అని
సంస్కృతంలోనికి అనువదించారు.

5 comments:

  1. BRUHATKATHA e language ante em rayali

    ReplyDelete
  2. Anonymous గారు,
    గుణాఢ్యుడు తన “బృహత్కథ” కావ్యాన్ని పైశాచీ భాషలోనే వ్రాశాడు. అదే సరైన సమాధానం. ఇతరులు దాన్ని సంస్కృతంలోకి అనువదించారు.

    ఈ వ్యాసంలోని మొదటి పేరాలో ఒకటి రెండు వాక్యాలే బహుశః మీకు ఈ సందిగ్ధాన్ని కలగజేస్తున్నాయేమో?
    (1). “ సంస్కృతంలో వెలసిన కథాకావ్యాలలో గుణాఢ్యుని బృహత్కథ చెప్పదగింది.” (మొదటి పేరాలో మొదటి వాక్యం).
    (2). “ బృహత్కథ సంస్కృతంలో కూర్చబడలేదు.” (మొదటి పేరాలో నాలుగో వాక్యం).

    ReplyDelete
    Replies
    1. నమస్కారం సార్.. మీతో నేను మాట్లాడవచ్చా..అయితే ఎలాగ...

      Delete
  3. సాహితీవందనం వారి గుణాఢ్యుడు బృహత్కథ ...కవిపండితులు తెలుసుకోవలసిన ..వాటిని అందించి
    భారతీమాత కు ప్రీతిపాత్రులైనారు

    ReplyDelete
  4. సార్.. ఈ పుస్తకం సరళ తెలుగు లో ఎక్కడ లభిస్తుంది.. చెప్పగలరు

    ReplyDelete