Saturday, December 24, 2022

యోగవాసిష్ఠం-లో ఏముంది?

 యోగవాసిష్ఠం-లో ఏముంది?




సాహితీమిత్రులారా!

మనలో చాలామందికి అప్పుడప్పుడూ వైరాగ్య భావన కలుగుతుంటుంది. ఆ సమయంలో ఇక ఏ పనీ చేయబుద్ధికాక, నిరాశానిస్పృహలు వచ్చేస్తుంటాయి. మనకే కాదు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి కూడా ఈ వైరాగ్య భావన కలిగింది. అయితే అది మనకు వచ్చేటటువంటి వైరాగ్యం కాదు. మనకి వైరాగ్యభావన సాధారణంగా మూడు సందర్భాలలో కలుగుతుంటుంది. అవి పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. అయితే రామచంద్రునకు కలిగింది ఏ కొద్దిసేపో ఉండే ఇలాంటి వైరాగ్యభావన కాదు. లోకాన్ని పరిశీలనగా చూసి, ఆత్మవిచారం చేయడం వల్ల కలిగిన వైరాగ్యం. అయితే స్వధర్మాన్ని ఆచరించే విషయంలో ఆయనకు కలిగిన సంశయం వల్ల ఈ వైరాగ్యభావన చింతగా మారింది. అటువంటి స్థితిలో ఉన్న శ్రీరామునకు వసిష్ఠ మహర్షి ఉపదేశించినదే ఈ యోగవాసిష్ఠం. దినినే వాసిష్ఠ రామాయణం అని, శ్రీవాసిష్ఠ గీత అని కూడా అంటారు. భగవద్గీతలో ఉన్న అనేక శ్లోకాలు ఈ యోగవాసిష్ఠంలోని శ్లోకాలను పోలి ఉంటాయి. వసిష్ఠ రామ సంవాదమైన ఈ యోగవాసిష్ఠాన్ని మొదట బ్రహ్మదేవుడు నిషధ పర్వతంపై మహర్షులకు బోధించాడు. ఆ తరువాతకాలంలో వాల్మీకి మహర్షి ఈ యోగవాసిష్ఠాన్ని తన శిష్యుడైన భరద్వాజునకు, ఆపై అరిష్ఠనేమి అనే మహారాజుకు బోధించాడు. 32 వేల శ్లోకాలు కల ఈ యోగవాసిష్ఠంలో ఆరు ప్రకరణాలున్నాయి. అవి.. వైరాగ్య ప్రకరణం, ముముక్షు ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం. ఏ ప్రకరణంలో ఏముందో ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం-

 Rajan PTSK గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment