Friday, December 2, 2022

ఆదిశంకరులు చేసిన నవరసముల వర్ణన

 ఆదిశంకరులు చేసిన నవరసముల వర్ణన




సాహితీమిత్రులారా!

సౌందర్యలహరిలో ఆదిశంకరులు అమ్మవారిని వర్ణించిన శ్లోకం!

మన భరతభూమిలో పుట్టినవారిలో ఎందరో కవులున్నారు. మరెందరో తాత్త్వికులూ ఉన్నారు. అయితే మహాతాత్త్వికుడే కాకుండా, మహోత్కృష్ట కవి కూడా అయిన దైవాంశ సంభూతుడు మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆసేతు హిమాచలం పాదచారియై పర్యటించి, అనేకరకాల అవైదిక మతాల ప్రభావంతో అస్తవ్యస్తమైన ఈ సమాజాన్ని, మళ్ళీ జ్ఞానమార్గం వైపు నడిపించినవాడు, దేశం నలుమూలలా ధర్మరక్షణకై నాలుగు పీఠాలు స్థాపించి, భరతజాతికి దిశానిర్దేశం చేసిన మహాపురుషుడు, “బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః” - పరబ్రహ్మము మాత్రమే సత్యము, ఈ కనబడే జగత్తంతా మాయ. జీవాత్మ పరమాత్మ వేరువేరు కాదు. ఉన్నది ఒక్కటే పదార్థం - అంటూ అద్వైత సిద్ధాంతానికి అసలు సిసలు వ్యాఖ్యనం చేసిన అపరశంకరావతారుడు… జగద్గురువులు  శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యులు.

మనలో చాలామంది నిత్యం పారాయణ చేసే, కనకధారాస్తవం, భజగోవింద స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, శివపంచాక్షరీ స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, గణేశ పంచరత్న స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇలా అనేక దైవప్రార్థనలకు కర్త మన ఆది శంకరుల వారే. ఇక శంకరులవారు తన కవిత్వాన్నంతా రంగరించి మనకు అందించిన అమృతపాత్రలు రెండు. అవి… ఒకటి శివానందలహరి. రెండవది… సౌందర్యలహరి.

అటువంటి సౌందర్యలహరి నుండి ఒక శ్లోకాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఈ శ్లోకంలో శంకరభగవత్పాదులవారు అమ్మవారి కళ్ళు పలికించే నవరసాల వర్ణన చేశారు. నిజానికి ఈ శ్లోకంలో కనబడేవి ఎనిమిది రసాలే. ఆ తొమ్మిదవ రసమైన శాంతము అన్నది జగన్మాత సహజస్థితిని సూచిస్తుంది. 

ఇక శ్లోకంలోకి వెళదాం.

శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా

సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ

హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ

సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment