Saturday, November 5, 2022

64 కళలు - ఏ కళ ఎందుకొరకు?

 64 కళలు - ఏ కళ ఎందుకొరకు?




సాహితీమిత్రులారా!

వాత్స్యాయన కామశాస్త్రములో చెప్పబడిన 64 కళలు

“విజ్ఞానాన్ని కలిగించేది విద్య - ఆనందాన్ని కలిగించేది కళ” అన్నారు మన పెద్దలు. అసలు ఆ మాటకొస్తే మనం నేర్చుకున్న విద్యను ప్రదర్శించడం కూడా ఒక కళే. ఉదాహరణకు వైద్యం వేర్చుకోవడం ఒక విద్య. నేర్చుకున్న ఆ వైద్యవిద్యతో రోగుల రోగాలను సరైన రీతిలో తగ్గించగలగడం ఒక కళ. ఒకే తరహా వైద్యవిద్య అభ్యసించినవాళ్ళు ఎందరో ఉంటారు. కానీ, వారిలో కొందరికే దానిని సమర్థవంతంగా ఉపయోగించే కళ అబ్బుతుంది. అలానే మిగిలిన విద్యలు కూడాను. సరే ఇక కళల్లోకి వద్దాం. “కవిత్వము, సంగీతము, చిత్రలేఖనము, విగ్రహ శిల్పము, నాట్యము” ఈ అయిదింటినీ లలిత కళలు అంటారు. వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. వీటిలో కవిత్వాన్ని, సంగీతాన్ని చరకళలనీ, చిత్రలేఖనము, విగ్రహ శిల్పము స్థిర కళలనీ, నాట్యము సమాహార కళ అనీ వ్యవహరిస్తూ ఉంటాం. మరి అయితే ఈ అరవై నాలుగు కళల సంగతేమిటి? ఈ కళలకు సంబంధించిన వివరాలు ఏ గ్రంథంలో ఉన్నాయి. ఈ అరవై నాలుగు కళల్లో ఏ కళ ఎందుకొరకు ఉపయోగపడుతుంది? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

మనకు ఈ 64 కళల ప్రస్తావన వాత్స్యాయన కామశాస్త్రంలో కనబడుతుంది. అందులో మొదటి అధికరణమైన సాధారణాధికరణములో మూడవ అధ్యాయమైన విద్యాసముద్దేశములో ఈ చతుష్షష్టి కళల వివరణ ఇవ్వబడింది. ఈ 64 కళలనే మూల కళలు అని కూడా అంటారు. సుమారు 95 సంవత్సరాల క్రితమే ఈ వాత్స్యాయన కామసూత్రాలను శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు తెలుగులో అనువదించారు. ఆ గ్రంథంలో ఇవ్వబడిన ఈ అరవై నాలుగు కళలకు చక్కని వ్యాఖ్యానం కూడా చేశారు. ఇక ఆ అరవై నాలుగు కళలకు సంబంధించిన పాఠంలోకి వెళదాం.

గీతమ్, వాద్యమ్, నృత్త్యమ్, ఆలేఖ్యమ్, విశేషకచ్ఛేద్యమ్, తండులకుసుమబలివికారాః, పుష్పాస్తరణం, దశనవసనాంగరాగః, మణిభూమికాకర్మ, శయనరచనం, ఉదకవాద్యం, ఉదకాఘాతః, చిత్రాశ్చయోగాః, మూల్యగ్రథనవికల్పాః , శేఖరకాపీడయోజనం, నేపథ్యప్రయోగాః, కర్ణపత్రభంగాః, గంధయుక్తిః, భూషణ యోజనం, ఐంద్రజాలాః, కౌచుమారాశ్చయోగాః, హస్తలాఘవం, విచిత్ర శాకయూషభక్ష్య వికారక్రియా పానకరసరాగాసవయోజనం, సూచీవానకర్మాణీ, సూత్రక్రీడా, వీణాడమరుక వాద్యాని, ప్రహేళికా, ప్రతిమాలా, దుర్వాచకయోగాః, పుస్తకవాచనమ్, నాటకాఖ్యాయికాదర్శనమ్, కావ్యసమస్యాపూరణం, పట్టికావానవేత్రవికల్పాః, తక్షకర్మాణి, తక్షణం, వాస్తువిద్యా, రూప్యరత్న పరీక్షా, ధాతువాదః, మణిరాగాకరజ్ఞానం, వృక్షాయుర్వేదయోగాః, మేషకుక్కుట లావక యుద్ధవిధిః, శుకసారికాప్రలాపనం, ఉత్సాదనే సంవాహనే కేశమర్దనే చ కౌశలమ్, అక్షర ముష్టికాకథనం, మ్లేచ్ఛితకవికల్పాః, దేశభాషా విజ్ఞానం, పుష్పశకటికా, నిమిత్తజ్ఞానమ్, యంత్రమాతృకా, ధారణమాతృకా, సంపాఠ్యం, మానసీకావ్యక్రియా, అభిధాన కోశః, ఛందోజ్ఞానం, క్రియాకల్పః, ఛలితకయోగాః, వస్త్ర గోపనాని, ద్యూతవిశేషాః, ఆకర్ష క్రీడా, బాలక్రీడనకాని, వైనయికానాం, వైజయికానాం, వ్యాయామికానాం చ విద్యానాం జ్ఞానం ఇతి చతుషష్టి రంగ విద్యాః కామసూత్రస్యావయవిన్యః

ఇదీ వాత్స్యాయన కామశాస్త్రములో ఇవ్వబడిన 64 కళలకు సంబంధించిన పాఠం. ఇప్పుడు ఒక్కొక్క కళ గురించీ క్లుప్తంగా తెలుగుకుందాం. 


Rajan PTSK గారికి ధన్యవాదాలు


No comments:

Post a Comment