మొదటిది వదలి రెండవదాన్ని పాటించు
సాహితీమిత్రులారా!
విప్రతిషేధే పరం కార్యమ్ - అనేది పాణినీయం
వ్యాకరణ సూత్రం. విప్రతిషేధే పరం కార్యమ్ - అంటే
మొదట చెప్పిన విధీ(కార్యము), తరువాత చెప్పిన విధీ
(కార్యము) రెండూ ఒకే శబ్దం విషయంలో తారసిల్లినపుడు
(వచ్చినపుడు) మొదటి విధిని విడిచి రెండవ విధిని
గ్రహించాలి అనేది సూత్రార్థం.
దీన్ని గ్రహించిన ఒక కవి
ఎంత చమత్కారంగా వాడాడో చూడండి-
"నిజపలి రాద్యః ప్రణయీ,
హరిర్ద్విలీయః, కరోమి కిమ్ గోపి!"
"శృణుసఖీ పాణి సూత్రం
విప్రతిషేధే పరం కార్యమ్"
రాధ ఆమె చెలికత్తెల సంభాషణగా కూర్చబడినది
రాధ - నిజపలి రాద్యః ప్రణయీ,
హరిర్ద్విలీయః, కరోమి కిమ్ గోపి!
(నా భర్త నామీద మొదటి నుంచి ప్రణం ఒలికించాడు
ఇప్పుడేమో కృష్ణుడొకడు నా జీవితంలో ప్రవేశించాడు
ఏమిచెయ్యనే)
గోపిక - శృణుసఖీ పాణి సూత్రం
విప్రతిషేధే పరం కార్యమ్
(ఏముందీ అటువంటి వాటన్నిటికి శాస్త్రకారులు మనకు దారి
చూపించే పోయారు పాణిని సూత్రం వినలేదా
విప్రతిషేధే పరం కార్యమ్- అని)
అంటే మొదటివాడైన భర్తను వదిలేసి రెండవవాడైన కృష్ణుని
ఆశ్రయించమని సలహా ఇచ్చింది - పాణిని సూత్రం ఎంతబాగా
ఉపయోగించింది
No comments:
Post a Comment