Monday, October 26, 2020

ఎటువంటి స్త్రీని కలువకూడదు

 ఎటువంటి స్త్రీని కలువకూడదు






సాహితీమిత్రులారా!



మన పూర్వులు చెప్పిన మంచిమాటలలో

చాల గొప్ప విషయాలున్నాయి.

చారుచర్య అనే నీతిశాస్త్రంలో

చెప్పిన ఈ నీతి అంశాన్ని గమనించగలరు.

నేటి సమాజంలో స్త్రీకి ఎంత విలువ ఉందో

మనం రోజువారి జరిగే సంఘటనలను బట్టి

తెలుస్తూంది. ఎలాంటి స్త్రీలతో కలువకూడదో

కామపు చూపు చూడకూడదో 

చెప్పే పద్యం ఇది గమనించగలరు-


వనితలు సంభోగమున వర్జనీయలు

            తగఁదన్ను నేలు నాతని పురంధ్రి

బంధువు నిల్లాలు బ్రాహ్మణోత్తము భార్య

            చెలికాని పడఁతి వీరలఁ దలంప

మాతృసమానలు మనువు దప్పిన యింతి

            కన్నియ ముదిసిన కాంత రూప

శీలగుణమ్ములచేత నిందితయైన 

            ముదితయుఁ దనజాతి మాత్రకంటె

నతిశయంబగు  వర్ణంబు నతివ బొగ్గు

చాయ మేనిది కడుఁబల్ల చాయ పడఁతి

పెద్దవళులది కడురోగి తద్ద బడుగు

గేడి గుజ్జనఁబడు వీరిఁ గూడఁ జనదు

                                                                        (చారుచర్య-57)

ఎవితో కలువకూడదో చారుచర్య కారుడు ఈ విధంగా

చెబుతున్నాడు-

1. యజమాని భార్య, 2. బంధువు భార్య, 3. ఉత్తమ బ్రాహ్మణుని భార్య,

4. స్నేహితిని భార్య వీరంతా తల్లితో సమానులు. ఇంకా 

ఎవరితో కలువకూడదంటే వివాహము చెడిపోయిన స్త్రీని, 

రజస్వలకాని స్త్రీ అంటే కన్నియను, ముసలి స్త్రీని, 

రూపము శీలము గుణములేని స్త్రీని, 

తనకంటే పైజాతికి చెందిన స్త్రీని, 

నల్లని బొగ్గలాంటి స్త్రీని, పల్లపు(ఎర్రనిరంగు)స్త్రీని, 

పొట్టపైన పెద్దపెద్ద ముడుతలు పడిన స్త్రీని,

జబ్బుపడిన స్త్రీని, బాగా ఓపికలేని స్త్రీని, 

పొట్టిపొట్టి కాళ్ళుచేతులు గల స్త్రీ -

ఇలాంటి స్త్రీలతో సంభోగించరాదని భావం.


No comments:

Post a Comment