Friday, October 16, 2020

ఒక రాత్రి (శ్రీశ్రీ కవిత)

 ఒక రాత్రి (శ్రీశ్రీ కవిత)
సాహితీమిత్రులారా!శ్రీశ్రీగారి మహాప్రస్థానం నుండి

ఒక రాత్రి కవిత ఆస్వాదించండి-


గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి -

బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!


ఆకాశపు టెడారి నంతటా, అకట!

ఈ రేయి రేగింది ఇసుకతుఫాను!


గాలిలో కనరాని గడుసు దయ్యాలు

భూ దివమ్ముల మధ్య ఈదుతున్నాయి!


నోరెత్త, హోరెత్తి నొగులు సాగరము!

కరి కళేబరములా కదలదు కొండ!


ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన 

ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి!


విశ్వమంతా నిండి, వెలిబూది వోలె

బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!


No comments:

Post a Comment