Sunday, October 18, 2020

ప్రాతఃకాలం (కవిత)

 ప్రాతఃకాలం (కవిత)




సాహితీమిత్రులారా!



దేవరకొండ బాలగంగాధరతిలక్ గారి

అమృతం కురిసిన రాత్రి  - నుండి

ప్రాతఃకాలం కవిత

ఆస్వాదించండి-


చీకటి నవ్విన 

చిన్ని వెలుతురా!

వాకిట వెసిన

వేకువ తులసివా!


ఆ శాకుంతల ధ్వాంతములో

నవసి యిలపై వ్రాలిన

అలరువా!  - అప్స

రాంగనా సఖీ చిరవిరహ 

నిద్రా పరిష్వంగము విడ

ఉడు పథమున జారిన 

మంచు కలవా!


ఆకలి మాడుచు 

వాకిట వాకిట 

దిరిగే పేదల

సురిగా దీనుల

సుఖ సుప్తిని చెరచే

సుందర రాక్షసివా!


యుద్ధాగ్ని పొగవో - వి

రుద్ధ జీవుల రుద్ధ కంఠాల

రొదలో కదిలెడి యెదవో!

అబద్ధపు బ్రతుకుల వ్యవ

హారాల కిక మొదలో?


కవికుమారుని శుంభ

త్కరుణా గీతమవా!

శ్రీ శాంభవి కూర్చిన

శివఫాల విలసితమౌ

వెలుగుల బూదివా!


దేశభక్తులూ, ధర్మపురుషులూ

చిట్టితల్లులూ, సీమంతినులూ

ముద్దుబాలురూ, ముత్తైదువలూ

కూడియాడుచు కోకిల గళముల

పాడిన  శుభాభినవ ప్రభాత

గీత ధవళిమవా!



No comments:

Post a Comment