చంపినవారే మహాభక్తులా?
సాహితీమిత్రులారా!
ఈ చమత్కార శ్లోకం చూడండి.
భ్రాతృహంతా పితృహంతా మాతృహంతా చయ:పుమాన్
త్రయేతేచ మహాభక్తా: ఏతేషాంచ నమామ్యహమ్
అన్నను చంపినవాడు,
తండ్రిని చంపినవాడు,
తల్లిని చంపినవాడు
ఈ ముగ్గురు మహాభక్తులు.
వీరికి నమస్కారం.
ఎట్లా
అన్నను చంపినవాడు, తండ్రిని చంపినవాడు, తల్లిని చంపినవాడు
మహాభక్తులా?
ఎవరువారు?
అన్నను చంపినవాడు(విభీషణుడు),
తండ్రిని చంపినవాడు (ప్రహ్లాదుడు),
తల్లిని చంపినవాడు(పరశురాముడు)
ఈ ముగ్గురు మహాభక్తులు.
వీరికి నమస్కారం.
మొదటి ఇద్దరూ.. తమవారిని చంపడంలో వారి శతృవుకి సహకరించినవారు.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete