Friday, November 22, 2019

ఒక నవ్వునొప్పి


ఒక నవ్వునొప్పి




సాహితీమిత్రులారా!

నాకొక్కటివ్వవా…
ఒక చిత్రమనిపించే నవ్వు
పలవరింతలాంటి పలకరింత
ఏదో చోటనించి కబురెంతో కొంత

చిన్నదైనా పర్లేదు మంత్రదండం
పెద్దదైనా పర్లేదు అబద్ధ వాత్సల్యం
బరువైనా పర్లేదు గుప్పెడాలోచన

ఈ మసకలోంచి చూసినవన్నీ చూసినప్పుడల్లా
కుదుపుతూనే కదుపుతూనే ఉన్నాయనుకో
ఐనా ఒకప్పుడు చూర్లకిందా వరండాల్లోనూ
కుడుతున్న దోమల్ని తోలుకుంటూనూ
వంటింట్లో వాసనల్ని పోల్చుకుంటూనూ
మమతలు మెలిబెట్టుకోలేదా
మో మన మాటల్లో దొర్లాడా లేదా
విప్పిన మనసులొకటయ్యాయి కదా
చప్పున ఆశలెగిరాయి కదా…

అప్పట్లో
ఆరిన తడి తుడిచిందీ
ఏడ్చి మెచ్చుకుందీ
మెచ్చినట్టు ఏడ్చిందీ
నువ్వేనని తెలిసినా పర్లేదులే
ఇప్పట్లో…

కొంచెం తుళ్లి కొంచెం మళ్లి
కొంచెం నువ్వంటే తెలిశాక మరి కొంచెం వెనక్కెళ్లి
అలలన్నీ ఆపేసి చేతలన్నీ చెరిపేసి
మామూలుగానే తింటో తాగుతో తిరుగుతో అరుగుతో
కళ్లవెనుక చూపు మందగించినా పైకి
పళ్లబిగువున భలేగా నవ్వుతో భరిస్తో

మిత్రమా –
తెరిచిన ముడులు బిగిసేనా
దూసిన మాటలు చెదిరేనా…
నవ్వులు నిండేనా దుఃఖపు దోసిట్లో?
-----------------------------------------------
రచన: ఎస్. ఆర్. బందా, ఈమాట సౌజన్యంతో

3 comments:

  1. అయ్యా. తవికస్వామి. ఏమిటీ శిక్ష. ఎందుకు ఇంత కక్ష. పెట్టు ప్రాణ భిక్ష.

    ReplyDelete
    Replies
    1. ఇక దేవుడే రక్ష - నాలుగో లైను మర్చిపోయారేమోనని గుర్తు చేసాను. (నాకు పై పోస్ట్ కంటెంట్ మీద ఈ అజ్ఞాత వ్రాసిన అభిప్రాయంతో సంబంధం గాని, ఏకాభిప్రాయం గాని లేదు - కేవలం సరదా కోసం అలా పూరించడం జరిగింది. అర్ధం చేసుకోరూ ---------- కుంటార్లెండి)

      Delete
  2. కుంటామ్లెండి.దయచేయండిక

    ReplyDelete