ఎక్కడుంది వైరాగ్యం?
సాహితీమిత్రులారా!
యశోవర్మ కృత ప్రాకృతకావ్యం
గఉడవహో(గౌడవధః) లోని
ఈ శ్లోకం చూడండి
సోచ్చేయ కిం ణ రాఓ మోత్తూణ బహుచ్ఛలాఇం గేహాఇం
పురిసా రమంతి బద్ధుజరేసు జం కాణణంతేసు
అనేక మాయలు కపటాలతో నిండిన గృహనివాసం విడిచిపెట్టి
మనుష్యులు జలపాతాలతో అందంగా ఉన్న అరణ్యాలలో
నివసిస్తున్నారంటే అదిమాత్రం రాగం కాదా? అనగా
ఇల్లు వదలండం చేత వైరాగ్యవంతులైమనుకునేవారు
సుందరవనాలలమీద రాగం చూపుతున్నారు.
వైరాగ్యం ఎక్కడుందని భావం.
No comments:
Post a Comment