Sunday, April 2, 2023

మణిద్వీప వర్ణన

 మణిద్వీప వర్ణన




సాహితీమిత్రులారా!

ఒకసారి పార్వతీపరమేశ్వరులు హాయిగా విహరిస్తూ సరససల్లాపాలు ఆడుకుంటూ ఉండగా అమ్మవారు  అయ్యవారితో తనకోసం ఒక అందమైన భవనం కట్టించమని గోముగా అడిగింది. జగన్మాత అడిగితే జగత్పిత కాదంటాడా! పైగా భార్యంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ. దేహంలో సగభాగాన్నే భార్యకిచ్చి అర్ధనారీశ్వరుడయిన పూర్ణపురుషుడాయన. అంతటి ప్రేమ కనుకనే, అమ్మవారు ఇలా అడిగీ అడగంగానే భవనం ఏమిటి ఒక మహా నగరమే నిర్మించి తన ప్రేమ కానుకగా ఇవ్వడానికి సంకల్పించాడు. సాక్షాత్తూ స్వామివారే రంగంలోకి దిగడంతో బ్రహ్మవిష్ణువులు, దిక్పాలకులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, యక్ష గంధర్వ సాధ్య సిద్ధ కిన్నర కింపురుషాది సమస్త దేవతా గణాలూ బిరబిరమంటూ కదలివచ్చేశాయి. అమృత సముద్రం మధ్య భాగాన్ని నగర నిర్మాణానికి, అమ్మవారి విలాసభవనానికీ అనుకూల ప్రదేశంగా నిర్ణయించాడు పరమశివుడు. ముందుగా సుధాసముద్రం మధ్యలో ఒక విశాలమైన ద్వీపాన్ని సృష్టించాడు. అలా సదాశివ సంకల్పంతో ఉద్భవించిన మహోన్నత ద్వీపమే మణిద్వీపం. 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment