Monday, March 20, 2023

ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ - షేక్స్‌పియర్

 ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ -  షేక్స్‌పియర్ 




సాహితీమిత్రులారా!

కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే ఈ నాటకం షేక్స్‌పియర్ వ్రాసిన కామెడీ నాటకాలలో మొదటిది. అచ్చం ఒకేలా ఉండే కవలలతో తికమక పుట్టించి బోలెడంత హాస్యం పండించాడు షేక్స్‌పియర్. ఆ తరువాత కాలంలో ఈ నాటకన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. హిందీలో ప్రముఖ రచయిత గుల్జార్ దర్శకత్వం వహించిన అంగూర్ చిత్రం కూడా ఈ నాటకం ఆధారంగా తీయబడిందే. ఇక కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కథలోకి వెళితే.. సైరాక్యూజ్ నగరంలో ఈగియన్ అనే వర్తకుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఎమిలియా. వాళ్లకు కవల పిల్లలు పుట్టారు. కొడుకులిద్దరికీ ఆంటిఫోలస్ అనే పేరు పెట్టాడు ఈగియన్. అంతేకాదు వాళ్లకు సేవకులుగా ఉండడానికి మరో కవలల జంటను తీసుకొచ్చాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములకు కూడా డ్రోమియో అంటూ ఒక పేరే పెట్టాడు. ఇదిలా ఉండగా ఒకసారి ఈగియన్ తన కుటుంబంతో కలిసి సముద్ర ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను వచ్చింది. దానితో ఓడ కకావికలం అయిపోయింది. ఈగియన్, పెద్ద ఆంటిఫోలస్, పెద్ద డ్రోమియో ఒక దుంగ మీద, ఎమిలియా, చిన్న ఆంటిఫోలస్, చిన్న డ్రోమియో ఇంకొక దుంగ మీదా ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ అలల ఉధృతికి వాళ్ళ దారులు వేరైపోయాయి. ఈగియన్ అనేక ప్రయాసలకోర్చి తమ నగరమైన సైరాక్యూజ్ చేరుకున్నాడు. పెద్ద ఆంటిఫోలస్, అతని అనుచరుడు పెద్ద డ్రోమియో అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. ఒకనాడు చిన్న ఆంటిఫోలస్ తండ్రి అనుమతి తీసుకుని చిన్న డ్రోమియోతో కలిసి తన తల్లిని, అన్నను వెతకడానికి దేశాంతరం బయలుదేరాడు. అలావాళ్లు అనేక నగరాలు తిరుగుతూ తమ సోదరులను వెతకసాగారు.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment