Wednesday, March 18, 2020

కవి చమత్కారం


కవి చమత్కారం






సాహితీమిత్రులారా!

అడిదము(కత్తి)సూరకవికి విజయనగర ప్రభువు
పెద విజయరామరాజుకు అంతగా పడేదికాదని ప్రతీతి.
రాజేమో అహంకారి అది వారికి సహజం సూరనేమో కుర్రవాడు
ఒకసారి తురక సరదారు దండయాత్రకు
వస్తే సూరకవి ఏమన్నాడో చూడండి.

మెత్తనైనట్టి అరటాకు మీదగాక
మంటమీదను చెల్లునే ముంటివాడి
బీదలైనట్టి సరదార్ల మీద గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీద 

(ముల్లుకు అరిటాకు మీద చెల్లినట్లుగా
మంటమీద చెల్లుతుందా? కాలిపోదూ.
అలాగే రాజుగారి జులుం కింది సరదార్లమీదనేకాని,
నవాబుగారి సేనాపతి బాదుల్లాఖాను మీద చెల్లుతుందా - అని భావం.)

అయితే ఆ దండయాత్రలో రాజుగారు గెలిచారు.
అప్పుడు మళ్ళీ రాజుగారిని ప్రశంసిస్తూ ఈ పద్యం చెప్పాడట.


ఢిల్లీ లోపల గోలకొండపురి నిండెన్ నీ ప్రశంసల్ గులాల్
బల్లాలం బొడిపించి హుమ్మని అరబ్బా నెక్కి పైకొంచు బా
దుల్లాఖానుని బారద్రోలితివి నీ దోశ్శక్తి సూ బాలకున్
మళ్ళింపం దరమౌనె శ్రీ విజయరామా! మండలాధీశ్వరా!

చూడండి అటైనా ఇటైనా ఎటైనా చెప్పగలవాడు,
మెప్పించగలవాడు అడిదము సూరకవి.
సూరకవేకాదు ప్రతిభావంతుడైన కవి ఎవరైనా
ఇలాగే చేయగలరు.
అందుకే కవి ఎటైనా అంటే
రెండు వైపులా పదునే.

3 comments:

  1. ఉతికారేసిరి
    ఏకిరి జిలేబి
    నీకున్ సిగ్గున్
    గలదే చూడగన్

    ReplyDelete
    Replies
    1. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు. నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు. కొన్ని జీవాలంతే. అవి మారవు.

      Delete
  2. కవయః నిరంకుశః
    వారి నాలుకలు కత్తుల కన్నా పదునైనవి.
    చిరునవ్వులతో తలలూచిన ఆనాటి ప్రభువుల తలలోని తలపులు మహోన్నతమైనవి.
    తమలో తాము తగనితగవు లాటలు మన కవులకే చెల్లు.
    రాకాసిపరులపై పెనుగు లాటలు ఆనాటి ప్రభువులకే చెల్లు

    ReplyDelete