చమత్కార పద్యాల్లో దీవెన
సాహితీమిత్రులారా!పద్యాల్లో దీవెనలు చాలా చమత్కారాలు వాటిలో ఒకటి
క్రింది శ్లోకంలో చూడగలం. గమనించండి.
శ్లో. విష్ణో రాగమనం నిశమ్య, సహసా కృత్వా ఫణీంద్రం గుణం
కౌపీనం పరిధాయ చర్మకరిణ: శంభు: పురోధావతి:
దృష్ట్వా విష్ణురథం సకంప హృదయ: సర్పో పతత్ భూతలే
కృత్తి ర్వి స్ఖవితా హ్రియా నతముఖో నగ్నో హర: పాతువ:
శివుడు దిగంబరంగా ఉన్నాడు. విష్ణువు వస్తున్నాడని తెలిసింది. పామును మొలతాడుగా, గజచర్మాన్ని కౌపీనంగా పెట్టుకొని వెళ్ళాడు. గరుత్మంతుని చూడగానే పాముకు గుండెలవిసి కిందపడింది. గోచీ వూడిపోయింది. నగ్నుడై తలవంచుకొని వున్న పరమేశ్వరుడు మిమ్ము రక్షించుగాక - అని భావం
ఇందులో శంకరుని దిగంబరత్వం, పామునకు గరుత్మంతునకు గల
సహజవైరం మొదలైనవానితో కవి చమత్కారపూర్వకంగా ఆశీర్వదించాడు
ఇందులో శంకరుని దిగంబరత్వం, పామునకు గరుత్మంతునకు గల
సహజవైరం మొదలైనవానితో కవి చమత్కారపూర్వకంగా ఆశీర్వదించాడు
No comments:
Post a Comment