చమత్కార పద్యం -2
సాహితీమిత్రులారా!
కూచిమంచి తిమ్మకవి రచించిన రసికజనమనోరంజనం చదివిన ఒక వేశ్య ఒకానొకరోజు తిమ్మకవి ఆదారి వెంబడి పోతూ ఉండగా చూచి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ను వాటేసుకుందట దానితో ఏమీ అర్థంకాని ఆయన మొగం పక్కకు తిప్పుకున్నాడట. దాని ఆవేశ్య ఇలా అన్నది.
"చతురులలోన నీవు కడు జాణవటంచును నెంచి కౌగిలిం
   చితి నిటు మారుమోమిడగ చెల్లునె యో రసికాగ్రగణ్య?" - అన్నదట.
                                            దానికి తిమ్మకవిగారు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు.
                                                                          "అ
ద్భుతమగునట్టి బంగరపు బొంగరపుంగవబోలు నీ కుచ
ద్వితయము ఱొమ్మునాటి అల వీపున దూసెనటంచు చూచితిన్" - అని అన్నాడట.
 
No comments:
Post a Comment