క్రితంభాగంలో మనం మణిసిద్ధుడి వృత్తాంతం, ఒక సిద్ధుడి ఉపదేశానుసారం అతను కాశీప్రయాణానికి సిద్ధమవడం. తనతో కాశీకి రావలసినదిగా ఒక పశువుల కాపరిని అడగటం. అందుకు అతగాడు కాశీ గొప్పతనం గురించి తనకు చెప్పమనీ, అది తనకు నచ్చితేనే వస్తాననడం. సరేనన్న మణిసిద్ధుడు కథ చెప్పడానికి ఉద్యుక్తుడవడం, వరకూ కథ చెప్పుకున్నాం. ఈరోజు మణిసిద్ధుడు ఆ గొల్లవానితో చెప్పిన కాశీ మహిమను గురించిన కథ చెప్పుకుందాం.
కథల్లో కాశీమజిలీ కథల అందం వేరు. ఈ కథల రచయిత మధిర సుబ్బన్న దీక్షిత కవి గారు. నిజానికి వివిధ ప్రాంతలలో జానపదులు చెప్పుకునే కాశీమజిలీ కథలను పోగేసి, వాటికి మరిన్ని కల్పనలు జోడించి, వాటన్నింటినీ కలిపి 12 సంపుటాలుగా తీసుకు వచ్చారు సుబ్బన్న దీక్షితులు గారు. ఈ విషయాన్ని క్రీ.శ. 1900లో అచ్చయిన తమ “కాశీమజిలీ కథలు” మొదటి సంపుటి పీఠికలో ఆయనే చెప్పుకొచ్చారు. అంటే మొదటి సంపుటి అచ్చయ్యి ఇప్పటికి 120 సంవత్సరాల పైమాటే అన్నమాట. అప్పటి పుస్తక భాష గ్రాంథికం కనుక, అది ఇప్పటి తరంలో అందరికీ అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ కనుక, సరళమైన భాషలో, కథలో ఎటువంటి మార్పులూ చెయ్యకుండా, కుదిరినప్పుడల్లా, ఒక్కో కథా చెప్పుకుంటూ వెళతాను.
గుణనిధి అనే బ్రాహ్మణుడు మణిసిద్ధునిగా మారి, కోటప్ప అనే ఒక గొల్లపిల్లవాడిని వెంటబెట్టుకుని 360 మజిలీలతో కాశీ పట్టణాన్ని చేరుకుంటాడు. ఆ మజిలీలలో మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన కథలే ఈ కాశీమజిలీ కథలు. అద్భుతమైన కల్పనలు, మోతాదు మించని శృంగారం, కడపుబ్బా నవ్వించే హాస్యం, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే నాయికానాయకుల బుద్ధిచాతుర్యం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఇలా ఒకటేమిటి, నవరసాలూ మేళవించబడిన కథలివి. ఇంతమంచి కథలను మనకు అందించిన మధిర సుబ్బన్న దీక్షిత కవి గారికి నమస్కరించుకుంటూ… మనం కూడా కాశీమజిలీయాత్ర మొదలు పెడదాం.
ఈరోజు మనం చెప్పుకోబోతున్న కాఫీ దండకాన్ని రచించినది సంస్కృతాంధ్రాలలో మహా పండితుడైన శ్రీ పోకూరి కాశీపతి గారు. గద్వాల సంస్థానాధీసుడు ఈయనకు కవిసింహుడనే బిరుదునిచ్చి తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. వీరికి నిఘంటువులన్నీ కంఠోపాఠంగా ఉండేవట. వీరు పండితుడే కాదు మంచి కవికూడా. కాశీపతిగారు సారంగధరీయమనే త్ర్యర్థి కావ్యాన్ని రచించారు. అంటే కావ్యంలో ఉన్న పద్యాలన్నీ మూడేసి అర్థాలను కలిగి ఉంటాయి. ఒకలా అర్థం చెప్పుకుంటే పార్వతీకళ్యాణం, ఇంకొకలా అర్థం చెప్పుకుంటే తారాశశాంకం, మరొకలా చూస్తే సారంగధరుని కథ వస్తుంది. ఈ కాశీపత్యావధానులు గారు గొప్ప శతావధాని కూడా. 1920 ప్రాంతంలో, అంటే ఇప్పటికి వందేళ్ళ క్రితం, ఆయన అప్పటి మద్రాసులో నగరంలో అష్టావధానం చేస్తున్నారట. అప్పుడు పృచ్ఛకులలో ఒకరైన తాపీధర్మారావుగారు పోకూరి కాశీపతి గారిని కాఫీపై దండకమొకటి ఆశువుగా చెప్పమన్నారట. అలా కాశీపతిగారు అప్పటికప్పుడు చెప్పిన ఆ కాఫీ దండకాన్నే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.
లంకాధిపతి అయిన రావణాసురుడు ఎలా ఉండేవాడు? ఎలాంటి దుస్తులు ధరించేవాడు. అతని వాహనం ఏమిటి? అతడిని మొదటిసారి చూసినప్పుడు హనుమంతుడు ఏమనుకున్నాడు? రావణుని చూడగానే రామచంద్రమూర్తికి ఎటువంటి భావన కలిగింది? మొదలైన విషయాల గురించి పరమ ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడి ఉందో ఈరోజు చెప్పుకుందాం.
భాసో హాసః అంటూ కవితా కన్యకకు భాసమహాకవి దరహాసం వంటివాడని కీర్తించాడు జయదేవుడు. కాళిదాసభవభూతులకంటే పూర్వుడైన ఈ భాసుడు 24 రూపకాలు రచించినట్లుగా తెలుస్తోంది. కానీ అందులో 13 నాటకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటన్నింటిలోకీ ప్రతిమా నాటకం, చారుదత్తం, స్వప్న వాసవదత్తమనే నాటకాలు మరింత ప్రఖ్యాతి పొందాయి. ఈరోజు మనం స్వప్న వాసవదత్త నాటకం గురించి చెప్పుకుందాం. ఈ నాటకం గురించి చెప్పుకోవాలంటే మనం ముందుగా ప్రతితిజ్ఞాయోగంధరాయణమనే మరో భాసనాటకం గురించి కూజా కొద్దిగా చెప్పుకోవాలి. ఎందుకంటే స్వప్నవాసవదత్త నాటకం ఆ ప్రతిజ్ఞాయౌగంధిరాయణ నాటకానికి కొనసాగింపువంటిది.
కాళిదాసు భోజరాజు ఆస్థానంలో మొదటిసారి ప్రవేశించే సమయంలో కొందరు పండితులు అడ్డుపడతారు. వారికి బుద్ధి చెప్పడానికన్నట్టుగా నోరుతిరగడం కష్టమైన అయిదు పద్యాలను చెప్పి, వాటిని తిరిగి చెప్పమంటాడు కాళిదాసు. చదువుతుంటే మధ్యమధ్యలో నాలుక మడతపడేలా ఉండే ఆ పద్యాలు చెప్పలేక చేతులెత్తేస్తారు ఆ పండితులు. అలా కాళిదాసు ప్రతిభకు తార్కాణం నిలచిపోయాయా పద్యాలు. ఆ పద్యాల అర్థాల గురించి ఇంత వరకూ ఏ పుస్తకాలలోనూ రాలేదు కానీ, పిల్లలకు నోరు తిరగడానికి వాటిని భట్టీయం వేయించడం మాత్రం పూర్వపురోజుల్లో ఉండేదట. అలాంటి క్లిష్టమైన పద్యాలలో ఒకదానిని ఈరోజు మనం చెప్పుకుందాం. అంతేకాక అటువంటి కష్టమైన పద్యాన్ని చాలా సులువుగా ఎలా భట్టీయం వేసి అప్పచెప్పవచ్చో కూడా చెప్పుకుందాం. ముందుగా ఆ పద్యం.
ఇదీ ఆ పద్యం. మొదటి రెండు పాదాలూ కష్టం మీద పలకొచ్చుకానీ, మూడూ నాలుగు పాదాలను చూస్తే మాత్రం భయం వేస్తుంది. అయితే ఇటువంటి పద్యాలలో పలకడానికి కష్టంగా ఉన్న పదాలను విడదీసి వ్రాసుకుని చదివితే.. అప్పుడు మనకు సులభంగా నోరుతిరుగుతుంది. అటుపై ఆ పదాలనే వేగంగా పలకడం సాధన చేస్తే సరిపోతుంది. మనకు లెక్కల్లో కూడా చూడండి.. పదహారుని ఇరవైమూడుతో గుణిస్తే ఎంత అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి. మనం అప్పుడు ముందు మూడుతో పదహారుని గుణించి, ఆ తరువాత రెండుతో దుణించి, వాటిని ఒక క్రమ పద్ధతిలో వ్రాసి కూడతాం. కానీ అంతకన్నా సులువైన పద్ధతి ఒకటుంది. 23ని ఇరవైగా మూడుగా విడదీస్తే.. పదహారు ఇరవైలు 320, పదహారు మూళ్ళు 48. ఈ రెండూ కలిపితే 368. ఇలా చెయ్యాలన్నా కొంత సాధన చెయ్యాలి. కానీ ఈ విధానం అంతకు ముందు విధానం కన్నా సులభమైనది. అలానే పద్యం విషయంలో కూడా. ఈ పద్యాన్ని మనం ఇలా విడదీసి వ్రాసుకుందాం.
ఈరోజు మనం ఆధునిక కవులలో మహాకవులు అనదగ్గవారి చేతనే కైమోడ్పులు అందుకున్న మహోన్నత కవి, భావకవితా ప్రపంచపు రవి అయిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత్వం గురించి మాట్లాడుకుందాం.