Monday, August 29, 2022

చింతామణి నాటకంలో కథ ఏమిటి?

 చింతామణి నాటకంలో కథ ఏమిటి?




సాహితీమిత్రులారా!

చింతామణి నాటకంలో కథ ఏమిటి?

వరవిక్రయం, మధుసేవ, చింతామణి ఈ మూడు నాటకాలు సుమారు వందేళ్ళ క్రితం నాటివి. వీటి రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు. వీరు మంచి రచయిత మాత్రమే కాదు.. గొప్ప సంఘసంస్కర్త, జాతీయవాది కూడా. వీరు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ వరవిక్రయ నాటకాన్ని, ఇంటిని ఒంటిని గుల్ల చేసే మద్యపానానికి వ్యతిరేకంగా మధుసేవ నాటకాన్ని రచించారు. ఇక ఆనాటి సమాజంలో చాలా కుటుంబాలను ఛిద్రం చేసిన జాడ్యం వేశ్యావ్యామోహం. ఈ జాడ్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి నారాయణరావుగారు రచించిన మరో రచనే ఈ “చింతామణి” నాటకం. 

 పరమ భాగవతోత్తముడైన లీలాశుకుని జీవిత కథ ఆధారంగా ఆయన ఈ నాటకాన్ని రచించారు. లీలాశుకుడంటే శ్రీకృష్ణకర్ణామృతం రచించిన మహాత్ముడు. మనం ఎక్కువగా వినే.. “కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం” అనే శ్లోకం ఈ లీలాశుకుడు రచించిందే. 

 ఇక ఈ చింతామణి నాటకం అప్పట్లో విపరీతమైన జనాదరణ పొందింది. ఈ నాటకం ప్రభావంతో వేశ్యల ఇంటికి వెళ్ళే మగాళ్ళ శాతం చాలావరకూ తగ్గిపోయిందట. అంతేకాదు ఎంతోమంది వేశ్యలు తమ వేశ్యావృత్తి వదిలివేసి తమ జీవనానికి న్యాయమైన మార్గాలు ఎంచుకున్నారట. అంతగొప్ప నాటకాన్ని, కొన్ని నాటకాల కంపెనీల వాళ్ళు పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. జనాన్ని ఆకర్షించడం అనే పేరు చెప్పి ఆ నాటకంలో ద్వంద్వార్థాలను, ఆశ్లీలతను జొప్పించారు. కొన్ని వర్గాలను కించపరచేలా అసభ్యమైన సంభాషణలు కూడా ఇరికించేశారు. దానితో ఇది చిలికి చిలికి గాలివానై ఈ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిషేధించేంత వరకూ వెళ్ళింది. నిజానికి నిషేధించాల్సింది నాటకాన్ని కాదు. ఈ నాటకంలో జొప్పించిన అసభ్యతను. గతం 30 సంవత్సరాలుగా ప్రదర్శితమవుతున్న చింతామణి నాటకానికి, కాళ్ళకూరి నారాయణరావుగారు రచించిన చింతామణి నాటకానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. మన భాషాభిమానులంతా పూనుకుంటే అసలైన చింతామణి నాటకానికి తిరిగి ఊపిరిపొయ్యవచ్చు. ఇక “చింతామణి” నాటకంలో కథేమిటో చూద్దాం.


పిటియస్కె రాజన్ గారికి ధన్యవాదాలు


No comments:

Post a Comment