చేతిలోని జింకైనా పారిపోలేదు
సాహితీమిత్రులారా!
వద్దిపర్తి కోనంరాజు కూర్చిన
మహాలక్ష్మీపరిణయంలో
హాలాహలాన్ని శివుడు మ్రింగే సమయంలోని
సన్నివేశ వర్ణన తెలిపేదే ఈ పద్యం గమనించగలరు
శిరమున వేల్పుటేటి చెలి చెక్కుచెమర్చదు శైలకన్య తొం
దరపడ దర్థదేహమునఁ దాల్సిన పాపసరుల్ జవాడుచుం
బొరలవు మౌళి నున్న శశిపువ్వు రవంతయుఁ గందకుండు చే
మెఱసెడి జింక తూల్పడదు మేఁ జెమటెక్కదు శుభుమార్తికిన్
(మహాలక్ష్మీ పరిణయం - 2-47వపుట)
కాలకూట విషాన్ని చూచి దేవతలు రాక్షసులు సమస్తలోకాలు తల్లడిల్లి పోతుంటే
శివుడు దాన్ని నేరేడు పండులా గుటుక్కున మింగి గొంతులో నిలుపుకున్నాడు
మరి అప్పుడు విషాన్ని మ్రింగే సంయంలో శివుని శిరసునున్న గంగాదేవికి
ముఖంమీద చిన్న చెమట చుక్కరాలేదు.
పోనీ పార్వతీదేవి అర్థ శరీరంలో ఉన్నది
ఆమె గాబరాకూడ పడలేదు
ధరించిన పాములా పక్కకుకూడ సడలలేదు.
నెత్తినున్న శశిపువ్వు చందమామ రవ్వంత కూడ కందలేదు
చేతిలో మెరిసే జింకపిల్లో పారిపోవడంకాదు ఒక్క అడుగుకూడ తూలలేదు
పోనీ తనకైనా కనీసం చెమటైనా పట్టిదా లేదే - అలా మ్రింగాడుశివుడు విషాన్ని
No comments:
Post a Comment