Sunday, March 13, 2022

కుందవరపు కవిచౌడప్పా

 కుందవరపు కవిచౌడప్పా




సాహితీమిత్రులారా!

కవిచౌడప్ప పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి

కందపద్యాలే అందులోనూ బూతులతో కూడుకొన్నవి

అధిక్షేప శతకాలలో చెప్పదగినది చౌడప్ప శతకం

ఇక్కడ కొన్ని పద్యాలను గమనిద్దాం-


కందంబులు సకలజనా

నందంబులు సరసమధుర నవరసఘటికా 

బృందంబులు నీకవితా

కందంబులు కుందవరపు కవిచౌడప్పా


మునుపటి సుకవులనీతులు

జననుతములు, కుందవరపు చౌడుని నీతుల్

వినవినఁదేటతెనుంగై

కనబడుఁగద కుందవరపు కవిచౌడప్పా


నీతులకేమి యొకించుక

బూతాడక దొరకు నవ్వుపుట్టదు ధరలో

నీతులు బూతులు లోక

ఖ్యాతులురా కుందవరపు కవిచౌడప్పా


బూతన నగుదురు తమతమ

తాతలు ముత్తాత మొదలు తన తరముల వా

రేతీరున జన్మిచిరో

ఖ్యాతిగ మఱి కుందవరపు కవిచౌడప్పా


పదినీతులు  పదిబూతులు

పదిశృంగారములు గల్గు పద్యములు సభం

జదివినవాఁడేఁ యధికుఁడు

గదరప్పా కుందవరపు కవిచౌడప్పా


లంజలు రాకుండిన గుడి

రంజిల్లదు ప్రజలమనసు రాజిల్లదుగా

లంజలనేల సృజించెను

గంజజుడిల గుందవరపు కవిచౌడప్పా


నా నీతి వినని వానిని

భానుని కిరణములు మీఁదఁ బాఱని వానిన్

వానను దడవని వానిని

గానమురా కుందవరపు కవిచౌడప్పా

No comments:

Post a Comment