నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న కలదా నూరేళ్లు చింతించినన్
సాహితీమిత్రులారా!
ఈ పద్యం చూడండి-
రసవాదంబులు పెక్కు నేర్చిన,
మహారాజేంద్రులన్ గెల్చినన్
వెసతో మంత్రములుచ్ఛరించిన,
మహావిద్యల్ ప్రసంగించినన్
అసహాయంబగు శూరతం గనిన,
దా నంబోధి లంఘించినన్
నొసటన్ వ్రాసిన వ్రాలుకన్నఁ గలదా
నూఱేండ్లు చింతించినన్
రసవాదం అంటే పాదరసంతో బంగారు చేయగల విద్య నేర్చుకున్నా, గొప్పరాజులను గెలిచినా, ఎంతో ప్రయాసతో మంత్రాలు చదివినా, గొప్పవిద్యలను గురించిన ప్రసంగాలు చేసినా, అసహాయంతో శూరత్వాన్ని చూపించినా, సముద్రాన్ని లంఘించినా నొసటవ్రాసిన వ్రాతే గొప్పదిగాని వేరొకటి లేదని పద్యభావం.
No comments:
Post a Comment