Sunday, January 2, 2022

ఆజికి నిట్లనున్, బరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్

 ఆజికి నిట్లనున్, బరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్





సాహితీమిత్రులారా!



ఒకమారు కృష్ణదేవరాయలవారి ఆస్థానానికి ఒక కవి వచ్చి

అష్టదిగ్గజాలకు సవాలు విసరాడు తన్నుఓడించమని లేదా

జయపత్రం వ్రాసి యిమ్మని దానికి అతనిపైకి తెనాలిరామకృష్ణను

పంపారట.

నీకుగల అర్థజ్ఞానం ఎలాటిదో చూస్తాము 

ఈ పద్యాని అర్థం చెప్పమన్నాడట అని

ఈ పద్యం చెప్పాడట-

తేజము, సాధువృత్తమును, దేఁకువ గల్గిన ధీరుఁ డెప్పుడున్

ఆజికి నిట్లనున్, బరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్

తేజము, సాధువృత్తమును, దేఁకువ లేని బికారి యెప్పుడున్

ఆజికి నిట్లనున్, బరుని యాలికి నిట్లను నర్థికిట్లనున్

వచ్చిన ఆ కవికి ఇది అర్థకాలేదు సభ్యులకు తెలియలేదు

అప్పుడు రామకృష్ణకవిగారు తేజము సాధువృత్తము తేకువ గలవాడు

యుద్ధానికి తాను సిద్ధమని పరుని భార్యతనకు వద్దని అర్థికి దానం ఇచ్చునట్లు

చేతి సంజ్ఞలతో అభినయించి చూపాడు అలాగే పిరికివాడు యుద్ధానికి వద్దన్నట్లుగాను

పరునిభార్యరమ్మన్నట్లుగాను అర్థినకి దానం లేదన్నట్లుగాను అభినయించెను

దానితో సభాసదులు ఆనందించారు వచ్చిన ఆకవి తన ఓటమి అంగీకరించాడు

No comments:

Post a Comment