జీవన్ముక్తుడు
సాహితీమిత్రులారా!
జీవన్ముక్తుడు అంటే జీవించికూడా ముక్తి పొందినవాడు.
అలాంటివాణ్ణి శంకరభగవత్పాదులవారు ఇలా వర్ణిస్తారు-
క్వచిత్ బాలై సార్ధం కరతలగతావై సహిసితైః
క్వచి త్తారుణ్యాలంకృత నవవధూస్సహరమన్
క్వచిత్ వృద్ధైశ్చింతాకలిత హృదయైశ్చాపివిసన్
మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః
ఒకప్పుడు చేతులతో తాళాలు పుచ్చుకుని వాటిని మోగిస్తూ చప్పట్లు కొట్టడం,
కిలకిల నవ్వుతూ క్రీడా పరులైన బాలురతో ఆడడం, మరొకప్పుడు అలంకృతలైన
స్త్రీలతో చరిస్తూ ఉండడం, ఇంకొకప్పుడు సాంసారిక చింతాజాలంతో క్రుంగిపోయే
ముసలివాళ్ళతో కలిసి విచారించడం, ఇన్ని విధాల చరిస్తున్నా జీవన్ముక్తుడు అయిన
యతివరుడు జ్ఞానయోగదీక్షామహిమవల్ల దేహతాదాత్మ్య భ్రాంతిని పొందడు-
అని భావం
ఇలాంటి జీవన్ముక్తులు ఉన్నా మనం గుర్తించగలమా ఏమో
No comments:
Post a Comment