Wednesday, November 24, 2021

సరస్వతీదేవి స్తుతి

 సరస్వతీదేవి స్తుతి




సాహితీమిత్రులారా!


నీలకంఠ దీక్షితులవారు నీలకంఠవిజయచంపువు 

అనే గ్రంథం కూర్చారు ఇందులోని ఇతివృత్తం(కథ)

సముద్రమథనం. ఇది మహాభాగవతం, బ్రహ్మాండపురాణం,

భారతం మొదలైన వాటిలో ప్రఖ్యాతి పొందినది.

ఇందులో కవిగారు కూర్చిన సరస్వతీదేవి స్తుతి

ఇక్కడ గమనిద్దాం-


దేవానామపి దైవతం గురుమపి ప్రాచాం గురూణామిహ

శ్రీమంతం మదనాంతకం కథమపి స్తోతుం కృతో నిశ్చయః

తేన త్వాం త్వరయామి భారతి బలాత్కృష్టా2పి దుష్టే పథి

ప్రాసేనోపహతాపి జాతు కుపితా మా స్మ ప్రసాదం త్యజః


దేవదేవుడూ, ప్రాచీనగురువులకు గురువూ, అష్టైశ్వర్యసంపన్నుడూ

అయిన మదనాతకుణ్ణి(శివుణ్ణి) ఏలాగైతేనేం స్తుతింప నిశ్చయించాను

(కామం బంధం, కామదహనం బంధవిముక్తి. ఆ ముక్తినిచ్చేవాడు శివుడు

మరొకడు కాదు) కావున ఓ భారతీ(సరస్వతీ) తొందరగా వచ్చి నేను చెప్పినట్లు 

నా రచనను వేగంగా సాగింపచేయి. వేదవేదాంతమార్గాల్లో విహరించే నిన్ను 

వికటాక్షర బంధ పారుష్యాది దుష్టమైన కావ్య మార్గంలో బలాత్కారంగా లాగుతున్నాను.

 ఛేకానుప్రాస వృత్త్యనుప్రాసలనే బల్లేలతో పొడుస్తాను. ఐనా ఏమాత్రం కోపగించక నాపై

 ప్రసాదం(అనుగ్రహం. నారచనలో ఝటిత్వర్థావగత రూపమైన ప్రసాదగుణాన్ని) చూపడం

 ఎప్పుడూ మానొద్దు (సరస్వతీదేవీ) - అని భావం


ఇది స్తుతిమాదిరైనా వుందా 

అంతా ఆజ్ఞాపించినట్లే సాగిందికదా 

ఈ ప్రార్థనా శ్లోకం


No comments:

Post a Comment