Thursday, August 19, 2021

శ్రీశ్రీ పద్యాలు

శ్రీశ్రీ పద్యాలు





సాహితీమిత్రులారా!



శ్రీశ్రీ గారి  సిరి సిరి మువ్వలోని కందపద్యాలు

ఆస్వాదించండి-


కందం తిక్కన గారిది,

కుందవరపువారి ముద్దు కుర్రని దంతే

అందరి తరమా కందపు

చిందుల కిటుకుల్ గ్రహింప, సిరి సిరి మువ్వా


యుద్ధం పోతేనేం వా

గ్యుద్ధాలూ కాగితాల యుద్ధాలూ లో

కోద్ధరణ పేర మళ్ళీ

సిద్ధమురా కుందవరపు సిరి సిరి మువ్వా


గొర్రెల మందగ, వేలం

వెర్రిగ ఉద్రిక్త భావ వివశులయి జనుల్

కిర్రెక్కి పోయినప్పుడు

చిర్రెత్తుకు వచ్చు నాకు సిరి సిరి మువ్వా


ఈ రోజులలో ఎవడికి

నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్

కారాలు, తెగ బుకాయి

స్తే రాజ్యాలేలవచ్చు సిరి సిరి మువ్వా


జగణంతో జగడం కో

రగా దగదు కాని, దాని ఠస్సాగొయ్యా

నగలాగ వెలుగును గదా

చిగిర్చితే నాలుగింట సిరి సిరి మువ్వా

 

No comments:

Post a Comment