ఆసారం, ఇరమ్మదం, పరివేషం
సాహితీమిత్రులారా!
ఈ క్రింది పదాలను గమనించండి-
ఇంద్రధనుస్సు -
ఇది హరివిల్లు, సింగిణి అనే పదాలతో పిలుస్తాం.
దీనికే ఆంగ్లంలో రైన్ బౌ అని అంటారు.
ఆకాశంలో నీటి బిందువుల మీద సూర్యకిరణాలు పడి
ఏడురంగుల విల్లు ఆకారంలో సూర్యునికి వ్యతిరేక దిశలో
ఏర్పడుతుంది. (అది ఉదయ సాయం సమయాల్లోనే).
దీనికే ఇంద్రధనుస్సు అంటాం.
దుర్దినం - అంటే దుష్టమైన రోజు, చెడ్డదినం అని అర్థం
కానీ మనం దీన్ని ఆకాశంలో మేఘాలు కప్పి సూర్యదర్శనంలేని
మబ్బు పట్టిన రోజుకు వాడతారు.
ఇరమ్మదం -
మేఘాల్లో పుట్టే నిప్పు, వజ్రాగ్ని, విద్యుదగ్ని
ఇరింగణం - వడిగాలి
ఆసారం - జడివాన అంటే కుండ పోతగా కురిసే వర్షం
ముసురు -
విడవకుండా మబ్బులతో కూడి సన్నగా పడుతుండే వాన
సంవర్తం -
ప్రళయకాలం - ఈ కాలంలో సర్వలోకాల నాశనం జరుగుతుంది.
దీనికే యుగాంతం, కల్పాంతం, క్షయకల్పం అని పేర్లు.
పరివేషం -
కాంతి వలయం - అంతటా వ్యాపించేది.
సాధారణంగా దేవతా విగ్రహాల చుట్టూ అంటే
ముఖంపైన తల వెనుకల భాగంలో గుండ్రంగా కాంతి చక్రాన్ని
చూస్తుంటాం దానికే పరివేషం అని పేరు.
No comments:
Post a Comment