Tuesday, September 1, 2020

''సాని'' అంటే ఏమిటి?

 ''సాని'' అంటే ఏమిటి?

సాహితీమిత్రులారా!సాని అనే పదం మనకు సుపరిచితమే కానీ దాని అర్థం మాత్రం

మనకు వేరుగా వ్యవహారంలో గమనిస్తాం. 

సాని అంటే సంపూర్ణ సంగీత పరిజ్ఞానం కలది అని.

- నుండి ని - వరకు పరిపూర్ణ సంగీత పాండిత్యాన్ని సంపాదించుకొన్న

గంధర్వాంగనకు సాని అని బిరుదునిచ్చేవారు. 

ఈ బిరుదుపొందిన ప్రథమ సంగీత విద్వాంసురాలు రంభయే అయి ఉండాలి.

తరువాత కాలంలో సాని అనేది ఒకబిరుదుగా ఉండేది. 

ఈ బిరుదును సంపాదించుకోవడానికి ప్రతి దేవనర్తకి ఎంతో కష్టపడాల్సివచ్చేది.  

కొందరు రాణులకు గౌరవప్రదంగా ఈ బిరుదు ఉండేది. 

పిల్లలమర్రిలోని ఎరుకలేశ్వరునికి దేవాలయం కట్టించిన 

బేతరాజు భార్యపేరు ఎర్రక్కసాని

ఎరుకలసాని, మంత్రసాని, దొరసాని అనే పదాలు

 గౌరవప్రదమైనవే కాని నీచమైనవికావు. 

రానురాను ఈ పదం విశిష్టత అంతరించి కళంకాన్ని ఆపాదించే 

నీచమైన  అర్థంగా మారిపోయింది.

                                                                                     (ఈ సమాచారం డా. నటరాజు రామకృష్ణ గారి రుద్రగణిక నుండి.)

No comments:

Post a Comment