Thursday, September 24, 2020

రాకా - అనుమతీ - సినీవాలి - కుహూ

 రాకా - అనుమతీ - సినీవాలి - కుహూ
సాహితీమిత్రులారా!మనం అనేక పదాలను వాటి అర్థాలను

పోగొట్టుకుంటున్నాము

అలాంటి పదాలలో  

రాకా - అనుమతీ - సినీవాలి - కుహూ 

పదాలు కొన్ని

వీటిని గురించి తెలుసుకుందాం

పౌర్ణమి తిథి రెండు విధాలు

1. రాకా - రాత్రీ పగలూ మొత్తం అంతా పౌర్ణమి ఉంటే అది రాకా

2. అనుమతీ -పగటికాలం వరకే పౌర్ణమీతిథి ఉంటే అది అనుమతీ


అలాగే

అమావాస్య  తిథి రెండు విధాలు

1. సినీవాలి- అమావాస్య తిథి సూర్యోదయం మొదలు మరుసటిరోజు     

                 సూర్యోదయం  వరకు ఉంటే అది సినీవాలి

2. కుహూ -  అమావాస్య తిథి సూర్యోదయం మొదలు మరుసటిరోజు 

                 సూర్యోదయం కన్న ఎక్కువ ఉంటే అది కుహూ


మనం మనభాషనే మరచిపోతున్న రోజులివి పదాలొక లెక్కా అంటే

నేను చెప్పలేను కానీ వీలైనంతైనా పదాలను గుర్తుంచుకుందామని నా అభిప్రాయం.

No comments:

Post a Comment